hyderabadupdates.com movies కలవడానికి ముందు సై అంటే సై

కలవడానికి ముందు సై అంటే సై

ఈ శుక్రవారం తెలుగులో మూడు సినిమాలు బాక్సాఫీస్ పోరుకు రెడీ అయ్యాయి. అందులో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం.. రష్మిక మందన్నా లీడ్ రోల్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా గురించి విడుదలకు ముందే ఇండస్ట్రీలో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు మంచి సినిమాలే చేస్తున్నా కోరుకున్న విజయం దక్కని సుధీర్ బాబు.. ఈసారి ట్రెండుకు తగ్గట్లుగా డివైన్ టచ్ ఉన్న హార్రర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ చిత్రమే.. జటాధర. తిరువీర్ హీరోగా నటించిన ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ కూడా పెయిడ్ ప్రివ్యూలతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

ఐతే ప్రస్తుతానికి ప్రధాన పోటీ రష్మిక, సుధీర్ చిత్రాల మధ్య ఉంది. వీటికి తోడుగా తమిళ అనువాదం ‘ఆర్యన్’ కూడా రిలీజవుతోంది. విశేషం ఏంటంటే.. రేపు బాక్సాఫీస్ దగ్గర ఢీకొట్టబోతున్న హీరో సుధీర్ బాబు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. ఆ తర్వాత కలిసి పని చేయబోతున్నారు. సుధీర్ బాబు తన కొత్త చిత్రాన్ని రాహుల్ దర్శకత్వంలోనే చేయబోతున్నట్లు వెల్లడించాడు. ‘చి ల సౌ’తో అందరినీ ఆశ్చర్యపరిచి.. ‘మన్మథుడు-2’తో షాక్ తిన్న రాహుల్.. ‘ది గర్ల్ ఫ్రెండ్’తో బౌన్స్ బ్యాక్ అయ్యేలానే కనిపిస్తున్నాడు. 

దీని తర్వాత అతను సుధీర్ బాబుతో ఒక సెన్సేషనల్ మూవీ చేయనున్నాడట. అలాంటి కథ ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా రాలేదని ఎలివేషన్ ఇస్తున్నాడు సుధీర్ బాబు. అదొక బాహుబలి తరహా సినిమా అని కూడా అతను చెప్పడం విశేషం. సుధీర్ అంతగా చెబుతుండడంతో ఏంటా కాన్సెప్ట్ అనే ఆసక్తి కలుగుతోంది. దీంతో పాటు ఎప్పట్నుంచో వాయిదా పడుతూ వస్తున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లోనూ తాను నటించాల్సి ఉందని సుధీర్ తెలిపాడు. ‘భాగి’లో విలన్ రోల్ చేశాక హిందీ నుంచి చాలా ఛాన్సులు వచ్చినా తాను నటించలేదని.. ‘జటాధర’తో హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టకుంటాననే నమ్మకం ఉందని సుధీర్ బాబు తెలిపాడు.

Related Post

విజయ్ సినిమా అంటున్నా.. బాలయ్యే కనిపిస్తున్నాడువిజయ్ సినిమా అంటున్నా.. బాలయ్యే కనిపిస్తున్నాడు

ఈ రోజుల్లో రీమేక్ అనగానే ప్రేక్షకులు ఆసక్తి కోల్పోతున్నారు. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల ఏ భాష సినిమా అయినా సరే అందరూ చూసేస్తుండమే అందుక్కారణం. చూడకపోయినా సినిమా విశేషాలు తెలిసిపోతుండడంతో ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు. ఈ నేపథ్యంలో తమ సినిమా

3 Malayalam movies to watch on OTT: Noble Babu Thomas’ Karam to Nerariyum Nerathu3 Malayalam movies to watch on OTT: Noble Babu Thomas’ Karam to Nerariyum Nerathu

Cast: Abhiram Radhakrishnan, Shibla Farah, Swathi Das Prabhu, Rajesh Azhikodan, Swetha Vinod, Nisanth SS, Aparna Vivek Director: Renjith Venugopal Genre: Romantic Drama Runtime: 1 hour and 32 minutes Streaming Date: