hyderabadupdates.com Gallery క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరు భేష్ : సీఎం

క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరు భేష్ : సీఎం

క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరు భేష్ : సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరుపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదిలా ఉండ‌గా జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న వన్ మంత్… వన్ విలేజ్… ఫోర్ విజిట్స్ కార్య‌క్ర‌మం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు ఈ సంద‌ర్బంగా త‌న ప్లాన్ ను , అమ‌లు చేస్తున్న విధానాన్ని మెచ్చుకున్నారు. వింజమూరు ప్రజా వేదిక సభలో సీఎం ప్రత్యేకంగా ఈ కార్యక్రమంపై ప్రస్తావించారు. ఒక నెలలో ఒక గ్రామంలో నాలుగు సార్లు రెవెన్యూ అధికారులు పర్యటించి ఆ గ్రామంలో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని అన్నారు. దీంతో రెవెన్యూ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని సీఎం అన్నారు.
ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రవేశపెట్టినందుకు గాను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. తొలుత ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించిన సీఎం ఛాంపియన్ ఫార్మర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమం కూడా జిల్లాలో బాగా అమలు చేస్తున్నారని, వ్యవసాయ రంగంలో రైతులను చైతన్య పరిచేందుకు, నూతన విధానాలను ఛాంపియన్ ఫార్మర్ల ద్వారా ఇతర రైతులకు పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు. నారా చంద్ర‌బాబు నాయుడు. వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్, ఛాంపియన్ ఫార్మర్ కార్యక్రమాలను సీఎం ప్రత్యేకంగా పేర్కొన‌డం ప‌ట్ల క‌లెక్ట‌ర్ శుక్లా తెగ సంతోషానికి లోన‌య్యారు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని వినూత్న ప్రోగ్రామ్స్ రూపొందించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు సీఎం.
The post క‌లెక్ట‌ర్ హిమాన్షు శుక్లా ప‌నితీరు భేష్ : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Punjab Ex DGP: మాజీ డీజీపీ కొడుకు అనుమానాస్పద మృతి కేసులో భయానక ట్విస్ట్‌Punjab Ex DGP: మాజీ డీజీపీ కొడుకు అనుమానాస్పద మృతి కేసులో భయానక ట్విస్ట్‌

      పంజాబ్ మాజీ డీజీపీ కొడుకు మృతి కేసులో భయంకరమైన ట్విస్ట్‌ వెలుగు చూసింది. తన భార్యతో… తన తండ్రి అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. అప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారని, చివరకు చంపేందుకు కూడా

ఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేయండిఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేయండి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎనర్జీ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాల‌న్నారు. ఇతర దేశాల్లో విద్యుత్ రంగంలో జరుగుతున్న పరిణామాల్ని అధ్యయనం చేయాల‌ని సూచించారు. టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఏర్పాటు చేసిన సెంటర్