న్యూఢిల్లీ : భారత జట్టు మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన బీసీసీఐ నమాన్ అవార్డుల ప్రధానోత్సవం లో విశిష్ట అతిథిగా హాజరయ్యాడు. ఇదిలా ఉండగా కల్నల్ సికె నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగారాహుల్ ద్రవిడ్ వినయంగా స్పందించారు. భారత క్రికెట్ కు విశిష్ట సేవలు అందించిన దివంగత కల్నల్ సీకే నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు. ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా కృతజ్ఞతగా ఉందన్నాడు. మునుపటి గ్రహీతలు మన దేశంలోని గొప్ప దిగ్గజాలలో కొందరు ఉన్నారని అన్నాడు.
వారిలో నేను గౌరవంగా చూసిన,ఆరాధించిన వ్యక్తులు ఉన్నారు. నేను క్రికెట్ లో ఆడటం మొదలు పెట్టినప్పటి నుండి నేటి దాకా వారంతా నాకు నిత్యం ప్రేరణగా నిలుస్తూనే వస్తున్నారని పేర్కొన్నాడు. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఇవాళ నేను మీ ముందు ఇలా నిల్చొని మాట్లాడుతున్నానంటే దీనికి కారణం క్రికెట్. అది లేక పోతే రాహుల్ ద్రవిడ్ ఎవరో ఈ దేశానికి , ప్రపంచానికి తెలిసి ఉండేది కాదన్నాడు. భారత క్రికెట్లో పాల్గొనడం చాలా అదృష్టవంతుడిని అని చెప్పారు. మొదట ఆటగాడిగా, అంతకు ముందు జూనియర్ క్రికెటర్‌గా బిసిసిఐ వ్యవస్థ నుండి ప్రయోజనం పొందుతూ వచ్చానని అన్నాడు.
కర్ణాటక తరపున దేశవాళీ క్రికెట్ ఆడటం నుండి 16 సంవత్సరాలు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం వరకు, ఇది అద్భుతమైన ప్రయాణం అని గుర్తు చేశాడు మరోసారి రాహుల్ ద్రవిడ్. భారతదేశంలో ఎల్లప్పుడూ ప్రతిభ ఉండేది, కానీ కొన్నిసార్లు మనకు మౌలిక సదుపాయాలు, అవకాశాలు లేవు అన్నారు. కానీ ఇవాళ దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కోచింగ్ చిన్న పట్టణాల నుండి ప్రతిభను పొందగలవని నిర్ధారించాయని అన్నాడు రాహుల్ ద్రవిడ్.
The post కల్నల్ సీకే నాయుడు అవార్డు అందుకోవడం అదృష్టం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
కల్నల్ సీకే నాయుడు అవార్డు అందుకోవడం అదృష్టం
Categories: