hyderabadupdates.com movies కవిత దీక్ష.. ఎవరికీ పట్టట్లేదా?

కవిత దీక్ష.. ఎవరికీ పట్టట్లేదా?

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే దీనిపై ఎక్కడా చడీచప్పుడు వినిపించడం లేదు. కనిపించడమూ లేదు. ఎవ్వరూ దీనిపై పెద్దగా స్పందించడమూ లేదు. దీంతో కవిత దీక్ష ఎవరికీ పట్టడం లేదా? అనే చర్చ ఆసక్తిగా మారింది. మరోవైపు పోలీసులు కూడా ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పక్షంలోనూ రెండు రోజులైనా కూడా ఎక్కడా మాట మాత్రం కూడా స్పందించలేదు.

ఎందుకీ దీక్ష?

ఖమ్మం జిల్లాలోని వెలుగు మట్ల గ్రామంలో ఇళ్లను తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లోనే బీఆర్‌ఎస్ తరఫున ఆందోళన చేశారు. అయితే దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ అభివృద్ధిలో భాగంగానే ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నామని అన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని కూడా కోరారు.

ఇక ఆ తర్వాత ఈ వ్యవహారంపై కవిత స్పందించారు. పేదల ఇళ్లను ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తాను నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పారు.

అయితే కవిత ప్రకటనలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె అన్నట్టుగానే నిరాహార దీక్షను ప్రారంభించారు. అయితే ఆమె దీక్షను తొలుత ధర్నా చౌక్‌లో చేయాలని అనుకున్నా అనుమతి రాలేదు. ట్యాంక్‌బండ్‌పై చేయాలని అనుకున్నా నిబంధనలు వర్తించలేదు. దీంతో నేరుగా హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలోనే నిరాహార దీక్షను చేపట్టారు. ఇలా గత రెండు రోజులుగా కవిత నిరాహార దీక్ష చేస్తున్నారు.

బుధవారం నాటికి మూడో రోజుకు ఈ దీక్ష చేరినప్పటికీ అటు ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ స్పందించలేదు. మరోవైపు కవిత దీక్షపై పెద్దగా చర్చ కూడా కనిపించడం లేదు. ఈ పరిణామాలతో ఎవ్వరూ దీనిపై స్పందించకపోవడం గమనార్హం.

ఇక కవిత డిమాండ్ల విషయానికి వస్తే ఖమ్మంలో కూల్చేసిన పేదల ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, వారికి పరిహారంగా సొమ్ములు ఇవ్వాలని కోరుతున్నారు. భవిష్యత్తులో పేదల ఇళ్ల జోలికి పోకుండా ఉండాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు.

Related Post

పవన్ కళ్యాణ్ కు పెద్దిరెడ్డి సవాల్పవన్ కళ్యాణ్ కు పెద్దిరెడ్డి సవాల్

తాము అటవీ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్టు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న ఆరోప‌ణ‌లు స‌రి కాద‌ని వైసీపీ నాయ‌కుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ 104 ఎక‌రాల అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించింద‌ని..