hyderabadupdates.com Gallery కాంగ్రెస్ స‌ర్కార్ కావాల‌ని వేధిస్తోంది

కాంగ్రెస్ స‌ర్కార్ కావాల‌ని వేధిస్తోంది

కాంగ్రెస్ స‌ర్కార్ కావాల‌ని వేధిస్తోంది post thumbnail image

హైద‌రాబాద్ : ఎన్టీవీలో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి ఓ ఐఏఎస్ మహిళా ఆఫీస‌ర్ మ‌ధ్య ఏదో లింకు ఉందంటూ జుగుస్సాక‌ర‌మైన రీతిలో క‌థ‌నం ప్రసారం అయ్యింది. ఆ త‌ర్వాత ఎపిసోడ్స్ లెక్క‌న యూట్యూబ్ ఛానల్స్ రెచ్చి పోయి మ‌రిన్ని క‌థ‌నాలు స్టార్ట్ చేశారు. అవి కూడా యూట్యూబ్ లో భారీ ఎత్తున వ్యూస్ సంపాదించుకున్నాయి. చివ‌ర‌కు స‌ర్కార్ సీరియ‌స్ గా తీసుకుంది. ఏకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. దీనికి అధికారిగా న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ ను నియ‌మించింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్లడించారు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి. త‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన వెంట‌నే రంగంలోకి దిగారు సీపీ స‌జ్జ‌నార్. మ‌హిళా ఇంటికి వెళ్లి త‌లుపులు కొట్టి అరెస్ట్ చేశారు.
దీంతో జ‌ర్న‌లిస్టులు దొంతు ర‌మేష్, ప‌రిపూర్ణ చారి, సుధీర్ ల‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్, హ‌రీశ్ రావు. కోర్టులో హాజ‌రు ప‌రిచారు. బెయిల్ పై విడుద‌లైన జ‌ర్న‌లిస్టులు దొంతు ర‌మేష్, సుధీర్ ,చారి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క వర్కింగ్ జర్నలిస్టులను కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయ లేద‌ని అన్నారు.
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెయ్యని తప్పుకు వర్కింగ్ జర్నలిస్టులను అరెస్ట్ చేసింద‌ని, ఆపై 24 గంటలు మానసిక క్షోభకు గురి చేయడం దారుణ‌మ‌ని అన్నారు.
ఇదిలా ఉండ‌గా తాను కేవలం వార్త చదివాన‌ని, ఏ వార్త వచ్చినా అది నేను చదువుతానని చెప్పింది మ‌హిళా జ‌ర్న‌లిస్టు , యాంక‌ర్ దేవి. ఇది నా వృత్తి ధర్మంలో భాగంగానే వచ్చిన వార్త అని పేర్కొంది. 3 గంటల పాటు నన్ను విచారించారని, నాకు ఎంత మెంటల్ హెరాస్మెంట్ ఉన్నా సమాధానాలు చెప్పానని అన్నారు. నిన్న వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాన‌ని, అయినా మళ్లీ అర్ధరాత్రి నా ఇంటికి రావాల్సిన అవసరం ఏముందంటూ ప్ర‌శ్నించారు. మా ఇంటికి వచ్చి, మా ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టారని, తాము ఏమీ దొంగ‌లం కామ‌ని అన్నారు.
The post కాంగ్రెస్ స‌ర్కార్ కావాల‌ని వేధిస్తోంది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ ఆర్థిక కార్య‌ద‌ర్శిపై హైకోర్టు సీరియ‌స్తెలంగాణ ఆర్థిక కార్య‌ద‌ర్శిపై హైకోర్టు సీరియ‌స్

హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆరు నూరైనా స‌రే రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఈరోజు కోర్టుకి హాజరు కావాల్సిందేనని ఆదేశించారు పైకోర్టు జడ్జీ రాజేశ్వర రావు. వందలాది మంది తెలంగాణ విశ్రాంత ప్రభుత ఉద్యోగులు తమ

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

    గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

CM Revanth Reddy: ‘తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్’ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్లో సీఎం రేవంత్CM Revanth Reddy: ‘తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్’ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్లో సీఎం రేవంత్

  తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఉన్న ఐక్యతా స్ఫూర్తిని చాటుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన దేశ ఈశాన్య ప్రాంతం ఎంతో అందమైనది, విభిన్నమైనదని.. పర్యావరణ సంపదతో పాటు, సాంస్కృతిక