hyderabadupdates.com movies కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   ‘కాఫీ కబుర్లు’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య దూరాన్ని తగ్గించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈనెల రెండో తేదీన టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సరికొత్త కార్యక్రమాన్ని లోకేష్ నేతృత్వంలో నిర్వహించారు. నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తలతో ఎలా మెలగాలో సూచించారు.

ఈ రోజు కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల శిక్షణా శిబిరానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో  ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తలను కలుసుకునే ప్రతి సందర్భం తనకు ప్రత్యేకమైన సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆలోచనలు, విజయాలు, నాయకత్వ లక్షణాలు, సంక్షేమ పథకాల అమలు, కార్యకర్తలకు గౌరవం, అందలం వంటి అంశాలపై వారితో చర్చించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

కాఫీ తాగుతూ ముచ్చటించుకునే ఈ వినూత్న కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ అధినేత తమతో పాటు కూర్చుని మాట్లాడటం వారికి ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, పార్టీ విధానాలు, గ్రామస్థాయిలో అన్ని పరిస్థితులు, మంచి చెడులు తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం మంచి వేదిక అవుతుందనేది చంద్రబాబు నాయుడు భావన.

Related Post

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయంబీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయం

తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఈ విషయంపై ఏదో ఒకటి త్వరగా తేల్చాలని తెలంగాణ స్పీకర్ కు ఆదేశాలు

కేసీఆర్ కి ఎప్పుడు ఎలా పేలాలో బాగా తెలుసుకేసీఆర్ కి ఎప్పుడు ఎలా పేలాలో బాగా తెలుసు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాదిన్నరగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు అసెంబ్లీకి, అటు జనంలోకి రాకుండా కేసీఆర్ కేవలం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే

ఆశ్చర్యం… ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ప్రభాస్ఆశ్చర్యం… ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో ప్రభాస్

ప్యాన్ ఇండియా హీరోలు ఒక సమయంలో ఒక సినిమా చేయడానికే కిందా మీద పడుతూ రెండు మూడేళ్లు తీసుకుంటున్న ట్రెండ్ లో పానీపూరిలు తిన్నంత ఈజీగా ప్రభాస్ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతు చిక్కడం లేదు. తాజాగా డాన్స్ మాస్టర్