hyderabadupdates.com Gallery కింగ్‌ కోసం ఆలనాటి అందాల ముద్దుగుమ్మ!

కింగ్‌ కోసం ఆలనాటి అందాల ముద్దుగుమ్మ!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో 100వ సినిమాతో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్‌గా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు “లాటరీ కింగ్” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం.

నాగార్జునకు ఇది మైలురాయి లాంటి సినిమా కావడంతో ఇందులోని ప్రతి అంశం ప్రత్యేకంగా ఉండబోతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా సీనియర్ నటి టబూ కనిపించనుందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నాగ్–టబూ జంట గతంలో ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఆ తర్వాత వారు ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలో కూడా కలిసి నటించారు. ఆ తర్వాత ఈ జంట మరోసారి కలిసి కనిపించలేదు.

ఇప్పుడీ మైల్‌స్టోన్ సినిమా కోసం మళ్లీ టబూను ఎంపిక చేశారన్న వార్త బయటకు రావడంతో అక్కినేని అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.
The post కింగ్‌ కోసం ఆలనాటి అందాల ముద్దుగుమ్మ! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’Rolex: తమిళనాడు అటవీశాఖ చేతికి చిక్కిన ‘రోలెక్స్‌’

Rolex : రోలెక్స్‌… ఈ పేరు చాలా ఫేమస్‌. విక్రమ్ సినిమా ఎండ్ టైటిట్ కార్డు పడేటప్పుడు… ఆ సినిమా సీక్వెల్ కు హింట్ ఇస్తూ… రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారు. కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఈ రోలెక్స్ (Rolex)

KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్KCR: కాంగ్రెస్‌ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్

KCR : కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా గడవకుండానే… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పల్లెల్లోని రైతులే

IPS officer: హరియాణా ఐపీఎస్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటుIPS officer: హరియాణా ఐపీఎస్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటు

IPS officer : హరియాణాలోని సీనియర్‌ ఐపీఎస్ అధికారి పూరన్‌ కుమార్‌ (Pooran Kumar) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.