కోల్ కతా : ఐసీసీ టోర్నీలో భాగంగా కీలకమైన మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. దాయాది పాకిస్తాన్ జట్టు ఒకవేళ సెమీ ఫైనల్ లేదా ఫైనల్ కు చేరుకుంటే కచ్చితంగా ఇండియాలోని కోల్ కతా, అహ్మదాబాద్ లో ఆడాల్సి ఉంటుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ఆయా మ్యాచ్ లకు సంబంధించి బీసీసీఐ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మంగళ వారం నుంచి టికెట్లు కూడా పెద్ద ఎత్తున అమ్మకానికి వచ్చాయి. లా అండ్ ఆర్డర్ దృష్ట్యా ఒకవేళ పాకిస్తాన్ గనుక ఇండియాలో పర్యటించక పోతే లేదా ఆడక పోతే , నిరాకరిస్తే గనుక అమ్ముడు పోయిన టికెట్ల స్థానంలో తిరిగి డబ్బులు క్రికెట్ ఫ్యాన్స్ కు అందజేస్తామని బీసీసీఐ ప్రకటించింది.
శ్రీలంక అర్హత సాధించి భారతదేశం కాకుండా మరే ఇతర జట్టుతో సెమీఫైనల్ ఆడితే కూడా తిరిగి చెల్లింపు ఉంటుందని స్పష్టం చేసింది ఐసీసీ. ఇదిలా ఉండగా ఐసీసీ టి20 మెగా టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. వచ్చే మార్చి 4వ తేదీన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 5వ తేదీన రెండవ సెమీ ఫైనల్ జరగనుంది. ఇక మొత్తంగా ఈ రెండింటిలో గెలుపొందిన జట్లు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. మార్చి 8వ తేదీన గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరగనుంది.
The post కీలక మ్యాచ్ లకు వేదిక కానున్న కోల్ కతా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
కీలక మ్యాచ్ లకు వేదిక కానున్న కోల్ కతా
Categories: