hyderabadupdates.com movies కేసీఆర్ పేరెత్తేందుకు కూడా కవితకు ఇష్టంలేదా?

కేసీఆర్ పేరెత్తేందుకు కూడా కవితకు ఇష్టంలేదా?

తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లతో మాజీ ఎమ్మెల్సీ మరియు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపై, కేసీఆర్ నాయకత్వంపై, కేటీఆర్ పై, హరీష్ రావుపై కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

తాజాగా కేసీఆర్ పేరెత్తేందుకు కూడా కవిత ఇష్టపడని వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి నేటికి 16 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా తన తండ్రి కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఒక యోధుడి దీక్ష వల్ల తెలంగాణ వచ్చిందంటూ కవిత చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే కవితపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ యోధుడి పేరెత్తేందుకు కూడా కవిత ఇష్టపడడం లేదని, కానీ ఆయన వల్లే కవిత ఇన్నాళ్లు పదవులు అనుభవించిన విషయాన్ని మరిచిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ లేకుండా కవితకు ఉనికి లేదని, అటువంటి నాయకుడిని సొంత కూతురు అయిన కవిత విస్మరించడం ఏంటని మండిపడుతున్నారు.

కేసీఆర్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటే, కన్న కూతురు మాత్రం ఈ రకంగా అవమానిస్తోందని అంటున్నారు. కేసీఆర్ ఫొటో లేకుండా కవిత ఎక్స్ లో చేసిన పోస్ట్ ట్రెండ్ అవుతోంది. కేసీఆర్ ఇమేజ్ లేకుండా కవిత పోస్ట్ చేశారని, కానీ ఇన్నాళ్లు ఆయన ఇమేజ్ వాడుకొని రాజకీయాల్లో ఎన్నో పదవులు చేపట్టారని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడైనా కవితకు సొంతగా ఇమేజ్ ఉందనుకుంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరఫున సొంతంగా పోటీ చేసి గెలవాలని నెటిజన్లు సవాల్ విసురుతున్నారు.

Related Post

ఇంట్లో బంగారం… తీరులో భయంకరంఇంట్లో బంగారం… తీరులో భయంకరం

వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు సృష్టించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ టీజర్ కం ట్రైలర్ ని విడుదల చేశారు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ మార‌కం విలువ‌ను పోల్చుకుంటాయి. దీని ఆధారంగానే ఎగుమతులు-దిగుమ‌తులు కూడా జ‌రుగుతాయి. దాదాపు వీటి ఆధారంగానే ఆయా దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ