hyderabadupdates.com movies కేసీఆర్ సభకు రాకుంటే బీఆర్ఎస్ ఖతం

కేసీఆర్ సభకు రాకుంటే బీఆర్ఎస్ ఖతం

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వెంటనే వెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత శాసన సభలో అడుగుపెట్టిన కేసీఆర్ పది నిమిషాలు కూడా సభలో ఉండలేదని, కేవలం అటెండెన్స్ కోసమే వచ్చారని ఆరోపిస్తున్నారు.

ఈ అంశంపై తాజాగా కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని ఆమె వ్యాఖ్యానించారు. తప్పులు జరిగితే వాటిపై మాట్లాడేందుకు కేసీఆర్ తప్పకుండా సభకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.

అలాగే హరీష్ రావు, ఇతర నాయకులు సభను వదిలి వెళ్లొద్దని, సభా సమయాన్ని వృథా చేయకూడదని కవిత సూచించారు. హరీష్ రావుకు కమిషన్లు తీసుకోవడం, అమ్మడం తప్ప మరేమీ తెలియదని ఆమె విమర్శించారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష సరికాదని, కేసీఆర్ ను ఉరి తీయాలని రేవంత్ అంటున్నారని, అలా అయితే రేవంత్ ను పదిసార్లు ఉరి తీయాలని కూడా కవిత వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, కవిత మండలి ఛైర్మన్ ను కలిశారు. ఆమె సెప్టెంబర్ 3న ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రాజీనామా ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. రాజీనామా ఆమోదించకముందే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం.

గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తాను సందర్శించిన విషయాలను సభలో ప్రస్తావించాలనే ఉద్దేశంతో కవిత ఈ అభ్యర్థన చేసినట్లు తెలుస్తోంది. తనను పిలిస్తే సిట్ కు అన్ని ఆధారాలు ఇస్తానని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అభ్యర్థనపై మండలి ఛైర్మన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Related Post

టాలీవుడ్ తెర ఎరుపెక్కుతోందిటాలీవుడ్ తెర ఎరుపెక్కుతోంది

తెలుగు సినిమా తెరమీద రక్తం పారుతోంది. ఒకప్పుడు హత్యలు లాంటి షాట్స్ చూపించేటప్పుడు వీలైనంత వయొలెన్స్ ఎక్స్ పోజ్ కాకుండా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడేవారు. శివలో శుభలేఖ సుధాకర్ మర్డర్ సీన్ ఒక్కటి చాలు బ్లడ్ లేకుండా ఎలా భయపెట్టవచ్చో

లోకేష్ సస్పెన్స్ ట్వీట్: రేపు ఉదయం భారీ ప్రకటన!లోకేష్ సస్పెన్స్ ట్వీట్: రేపు ఉదయం భారీ ప్రకటన!

ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌తో సస్పెన్స్ క్రియేట్ చేశారు. “ఉదయం 9 గంటలకు భారీ ప్రకటన!” అంటూ ఆసక్తి రేకెత్తించారు. విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం – సీఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు