hyderabadupdates.com Gallery కోకా కోలా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ ఇండియాలో

కోకా కోలా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ ఇండియాలో

కోకా కోలా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ ఇండియాలో post thumbnail image

న్యూఢిల్లీ : ప్ర‌పంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ఫీవ‌ర్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఇదిలా ఉండ‌గా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ను స్పాన్స‌ర్ చేస్తోంది ప్ర‌ముఖ శీత‌ల పానియాల సంస్థ కోకో కోలా. ఇదిలా ఉండ‌గా 12 సంవ‌త్స‌రా త‌ర్వాత భార‌త దేశానికి ఫిఫా క‌ప్ ను తీసుకు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఇండియాలో క్రికెట్ త‌ర్వాత ఫుట్ బాల్ మేనియా కూడా కొన‌సాగుతోంది. ఇటీవ‌లే వ‌ర‌ల్డ్ ఫుట్ బాల్ స్టార్ ప్లేయ‌ర్ మెస్సీ భార‌త దేశంలో కాలు మోపాడు. త‌ను హైద‌రాబాద్ , ఢిల్లీ, ముంబై, కోల్ క‌తా న‌గ‌రాల‌లో ప‌ర్య‌టించాడు. ల‌క్ష‌లాది మంది త‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికాడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా త‌న‌కు గ్రాండ్ వెల్ క‌మ్ చెబుతార‌ని, కానీ భార‌త దేశం లో ల‌భించిన ఆద‌ర‌ణ‌, ప్రేమ తాను మ‌రిచి పోలేనంటూ పేర్కొన్నాడు మెస్సీ. దీంతో కోకో కోలా కంపెనీ త‌ను స్పాన్స‌ర్ చేస్త‌న్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీని ఇండియాకు తీసుకు వ‌చ్చింది.
ఇదిలా ఉండ‌గా ఫిఫా 2026 కంటే ముందు ప్ర‌త్యేక భాగ‌స్వామిగా ఉంది. అయితే కోకా‑కోలా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రీడా చిహ్నాలలో ఒకదాన్ని భారతీయ అభిమానులకు దగ్గరగా తీసుకు రావడం ద్వారా ఫుట్‌బాల్‌తో తన దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ టూర్ ఫిఫా చార్ట‌ర్ ల్యాండింగ్ తో ప్రారంభ‌మైంది. ఢిల్లీలోని మాన్ సింగ్ రోడ్‌లోని తాజ్ మహల్ హోటల్‌లో అసలు ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియ; మాజీ బ్రెజిలియన్ ప్రపంచ కప్ విజేత ఆటగాడు, ఫుట్ బాల్ లెజెండ్ గిల్బెర్టో డి’సిల్వా; క్రీడా చరిత్రకారుడు , రచయిత బోరియా మజుందార్, కోకా-కోలా ఇండియా , నైరుతి ఆసియా అధ్యక్షుడు సంకేత్ రే, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గ్రీష్మా సింగ్, ఆసియా ప్రజా వ్యవహారాలు, కమ్యూనికేషన్లు, సస్టైనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ దేవయాని రాణా పాల్గొన్నారు.
The post కోకా కోలా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ ఇండియాలో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kurnool: కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతిKurnool: కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

    కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ ఇవాళ తెల్లవారుజామున బస్సు బైకును ఢీ కొట్టి అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాద

PM Narendra Modi: ‘ఆసియాన్‌’ సదస్సుకు వర్చువల్‌ గా హాజరుకానున్న ప్రధాని మోదీPM Narendra Modi: ‘ఆసియాన్‌’ సదస్సుకు వర్చువల్‌ గా హాజరుకానున్న ప్రధాని మోదీ

PM Narendra Modi : మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఈ నెల 26 నుంచి 28వ తేదీ దాకా జరుగనున్న అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ఈస్ట్‌ ఆసియన్‌ నేషన్స్‌(ఆసియాన్‌) 22వ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)