hyderabadupdates.com movies కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శివాజీ లాంటి సీనియర్ల ముందు బెరుకు లేకుండా నటించడం మెచ్చుకోవాల్సిన విషయమే.

అయితే వయసు పరంగా చూసుకుంటే తను చాలా చిన్నది. అయినా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కోర్ట్ లో తనతో పాటు నటించిన రోషన్ తో జట్టు కట్టించేలా ఆల్రెడీ బ్యాండ్ మేళం రూపొందింది. రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్లు గట్టిగానే జరుగుతున్నాయి. ఇటీవలే రోషన్, శ్రీదేవి డాన్స్ సాంగ్ ఒకటి విడుదల చేశారు.

అయితే ఈ పాట కొందరు ట్రోలర్స్ కి టార్గెట్ అయిపోయింది. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ ఫ్లేవర్ లో హుషారైన డాన్సులతో దీన్ని నింపేశారు కాబట్టి. దీంట్లో తప్పేమీ లేదు కానీ శ్రీదేవితో అప్పుడే ఇలా మాస్ కాస్ట్యూమ్స్, స్టెప్పులు వేయించడమే దీనికి దారి తీస్తోంది. శ్రీదేవి మొహంలో లేతదనం పోలేదు.

కోర్ట్ వచ్చి సంవత్సరాలు కాలేదు కాబట్టి ఆ పసితనం ఛాయలు ఇంకా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు శ్రీలీల, నవీన్ పోలిశెట్టి మీద షూట్ చేసినట్టు గోదావరి ఒడ్డున ఇలా జంపులు చేయించి తీయడం గురించి కామెంట్లు వస్తున్నాయి. కథ డిమాండ్ మేరకు చేసిందే కావొచ్చు కానీ సినిమా వచ్చే దాకా ఇవి తప్పవు.

శ్రీదేవికి అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి. తమిళంలో కూడా ఒక మూవీ సైన్ చేసినట్టు టాక్ ఉంది. ఈ మధ్య ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న, వస్తున్న వీడియోలు ఎక్స్, ఇన్స్ టాలలో దర్శనమిస్తున్నాయి. కోర్ట్ కంటే పెద్ద బ్రేక్ ఇంకా దక్కాలి. ఓ రెండు మూడేళ్ళలో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకోవాలి.

అప్పుడు కమర్షియల్ గా ఎలాంటి ఆటాపాటా చేసినా ఆడియన్స్ అంగీకరిస్తారు. ఇంకా కోర్టు జ్ఞాపకాలు ఫ్రెష్ గా ఉండగానే అనగనగా ఒక రాజు టైపులో ఈ జంటను మాస్ సాంగ్స్ లో కలిపేయడం వల్లే ఈ డిస్కషన్ జరుగుతోంది. బ్యాండ్ మేళం కూడా లవ్ స్టోరీనే. కాకపోతే ఎంటర్ టైనర్ జానర్ లో సీరియస్ అంశాలు లేకుండా సాగనుంది.

Related Post

తీరు మారని వైసీపీ… ‘అమరావతి’కి రాజ్యసభ ఓకేతీరు మారని వైసీపీ… ‘అమరావతి’కి రాజ్యసభ ఓకే

ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటు ఏకగ్రీవంగా అంగీకరించింది. ఈ మేరకు అమరావతి బిల్లుకు పార్లమెంటు దిగువ సభ లోక్ సభ బుధవారమే ఆమోదం తెలపగా… గురువారం పెద్దల సభ రాజ్యసభ కూడా ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. వెరసి

ప్రభాస్ కూడా కొట్టుంటేనాప్రభాస్ కూడా కొట్టుంటేనా

2026 బాక్సాఫీస్ సంక్రాంతి ప్రధాన ఘట్టం అయిపోయింది. మొత్తం అయిదు సినిమాల స్క్రీనింగ్లు అయిపోయాయి. టెక్నికల్ గా నారి నారి నడుమ మురారి ఈ రోజు విడుదల అయినా నిన్న ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున ఈవెనింగ్ షోలతో రిలీజయ్యింది. మన