hyderabadupdates.com movies క్యాష్ చేసుకోవడం ఉస్తాద్ చేతుల్లోనే ఉంది

క్యాష్ చేసుకోవడం ఉస్తాద్ చేతుల్లోనే ఉంది

సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాగానే కాదు గత నలభై రోజులుగా తమ హాళ్లకు ఫీడింగ్ ఇచ్చే స్టార్ హీరో బొమ్మ ఒక్కటీ రాకపోవడం వాళ్ళను వారాల తరబడి నిరాశలో ఉంచింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా చాలా చిత్రాలు వచ్చాయి కానీ అన్ని వర్గాలను మెప్పించినవి ఒక్కటంటే ఒక్కటి లేవు.

సో ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ థియేటర్లకు కళకళలాడేలా చేయాలి. ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది. సంక్రాంతి తర్వాత థియేటర్లకు దూరంగా ఉన్న మాస్ ఆడియన్స్ కు మొదటి ఛాయస్ పవన్ మూవీనే కానుంది. దాన్ని సరిగ్గా క్యాష్ చేసుకోవాలి. దురంధర్ రివెంజ్ ప్రీమియర్లను దృష్టిలో ఉంచుకుని ముందు రోజు రాత్రి బెనిఫిట్ షోలు వేసే ఆలోచనని మైత్రి మేకర్స్ దాదాపుగా మానుకున్నారు. ఇది మంచి ఆలోచనని చెప్పాలి.

సూపర్ హిట్ అయితే టెన్షన్ లేదు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కనీసం యావరేజ్ నుంచి ఎబోవ్ యావరేజ్ అనిపించుకున్నా చాలు వసూళ్ల వర్షం ఖాయం. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా బిసి సెంటర్లలో దురంధర్ ని పక్కకు నెట్టేయడం ఖాయం. పాజిటివిటీ ఉంటే పవన్ చేసే రచ్చ ఆ స్థాయిలో ఉంటుంది. ఓజిని మించిన ఉదాహరణ అక్కర్లేదు. ఎటొచ్చి పబ్లిక్ తో ఎంతో బాగుందనే మాట బయటికి రప్పించుకోవాలి. యునానిమస్ గా వాళ్ళను మెప్పించాలి.

సెన్సార్ టాక్స్, ఇంటర్వ్యూలలో హరీష్ శంకర్ చెబుతున్న మాటలను బట్టి చూస్తే కంటెంట్ ఏదో సాలిడ్ గానే ఉన్నట్టుంది. కాంబినేషన్ పరంగా గబ్బర్ సింగ్ ని మించి ఆశిస్తున్నారు అభిమానులు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద కూడా అంచనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చని అంటున్నారు కానీ ఏపీలో ఎంత హైక్ తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. అన్నీ సానుకూలంగా ఉంటే మాత్రం ఉస్తాద్ మీద కలెక్షన్ల వర్షం ఖాయం.

Related Post

Highest Paid Previews for Bollywood in India: Dhurandhar The Revenge is a MAMMOTH at the topHighest Paid Previews for Bollywood in India: Dhurandhar The Revenge is a MAMMOTH at the top

Dhurandhar: The Revenge stormed the Indian box office, amassing Rs. 39 crore nett approx for its paid previews on Wednesday evening. The previous best preview record from Bollywood was with Stree

మూర్తీభవించిన సేవాగుణం సత్యసాయి శతజయంతిమూర్తీభవించిన సేవాగుణం సత్యసాయి శతజయంతి

మూర్తీభవించిన మానవత్వానికి ప్రతీకగా నిలిచిన సత్యసాయి గురించి అన్నీ తెలియకపోయినా కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోవాలి. నేడు నవంబర్ 19 ఆయన శతజయంతి. ఈ సందర్బంగా పుట్టపర్తిలోని సత్యసాయి నిలయాల్లో భారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి నుంచి ఉపరాష్ట్రపతి వరకు

ఇళయరాజా పోరాటం… వేరొకరికి ఆదాయంఇళయరాజా పోరాటం… వేరొకరికి ఆదాయం

తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు ఏదైనా పాత సినిమాల హిట్ సాంగ్స్ కొత్త చిత్రాల్లో వాడుకుంటే పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. మహా అయితే ఒరిజినల్