హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదన్నారు. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందన్నారు సీఎల్పీ సమావేశంలో .ప్రజా ప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి గవర్నర్ చేసిన ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదని అన్నారు సీఎం. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయి పోయిందన్నారు. మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు . సభలో మాట్లాడే అంశాలపై విప్ ల మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాలన్నారు సీఎం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు సబ్జెక్ట్ మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వ లేదని వాపోయారు. సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు, జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదని గుర్తు చేశారు. సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నన్ను సభకు రాకుండా చేశారంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. మహిళా శాసన సభ్యులు హాజరుతో పాటు చర్చల్లో పాల్గొనాలని ఆదేశించారు. సభా చర్చల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం అవసరం అని స్పష్టం చేశారు సీఎం. అసెంబ్లీ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందన్నారు. పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్ లోనే అందరూ స్పందించాలన్నారు.
The post గవర్నర్ ప్రసంగం సర్కార్ కు రోడ్ మ్యాప్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
గవర్నర్ ప్రసంగం సర్కార్ కు రోడ్ మ్యాప్
Categories: