ప్రస్తుతం దేశవ్యాప్తంగా గూగుల్‌ను కుదిపేస్తున్న అంశం.. ‘మదర్ ఆఫ్ సైతాన్’. ఏంటిది? ఎందుకు? ఎలా ఆవిర్భవించింది? దీనివెనుక ఎవరు ఉన్నారు? ఇలా.. అనేక అంశాలను నెటిజన్లు తెగవెతికేస్తున్నారు. దీనికి కారణం.. దేశంలో గత నాలుగు రోజులుగా తీవ్ర చర్చకు.. భయానికి కూడా దారి తీసిన ఎర్ర కోట కారు పేలుడు ఘటనే. ఈ ఘటన జరిగి దాదాపు ఐదు రోజులు అయింది. అయినా.. దాని తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
దీనికి కూడా కారణం ఉంది. ఈ ఘటనకు సూత్ర ధారులు.. ఎవరైనా పాత్ర ధారులు మాత్రం అత్యున్నత వైద్య విద్యను చదువుకున్నవారే కావడం కారణం. అంతేకాదు.. ఈ దాడులకు మందుగుండు సామాగ్రిని తయారు చేసిన వైద్యులు.. అత్యంత ప్రతిభావంతులని అధికారులు గుర్తించారు. ప్రొఫెసర్లుగా, డీన్‌లు గా వారు వైద్య వృత్తిలో ఉన్నారు. అలాంటి వారు దేశానికి హాని తలపెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ పేరే.. ‘మదర్ ఆఫ్ సైతాన్’.
భారత దేశాన్ని వీరు సైతాన్‌తో పోల్చారని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో పలు చోట్ల విద్వంసాలు సృష్టించేందుకు అనేక ప్రయోగాలు చేశారు. కీలక రసాయనాన్ని రూపొందించారు. దీనిని మదర్ ఆఫ్ సైతాన్‌గా పిలుస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. దీనిని బహిరంగ ప్రదేశాలు.. ఆలయాలు, ఇతర హిందూ సామాజిక వర్గం చేరుచుకునే ప్రాంతాల్లోని తాగు నీటిలో కలపడం ద్వారా సామూహిక హననాలకు పక్కా ప్రణాళిక రచించారు.
అదేవిధంగా దీనిని పేలుడు పదార్థంగా కూడా వినియోగించుకోవచ్చు. పేరెన్నికగన్న వైద్యులు, ప్రస్తుతం ఉగ్రముఠాతో చేతులు కలిపినవారు.. తమకు ఉన్న జ్ఞానంతో ‘మదర్ ఆఫ్ సైతాన్’గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని వాడేందుకు సిద్ధం చేశారు. వాస్తవానికి ‘ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ ‘ అనే రసాయనం అత్యంత ప్రమాదకరం. దీనికి రసాయన భాషలో ఎలాంటి పేరు ఉన్నా.. దీనిని మదర్ఆఫ్ సైతాన్‌గా భావిస్తారు. డాక్టర్ల బృందం ఈ రసాయనాన్ని అమ్మోనియం నైట్రైట్‌తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేసింది. దీనిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.