hyderabadupdates.com Gallery గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలి

గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలి

గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలి post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇస్తోంద‌ని చెప్పారు. ఆధ్యాత్మ‌కత ఉట్టి ప‌డేలా ఆల‌యాల‌ను కూడా స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా తాజాగా అమ‌రావ‌తిలోని రాష్ట్ర స‌చివాల‌యంలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు నారా చంద్ర‌బాబు నాయుడు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణ పై కీల‌క సూచ‌న‌లు చేశారు. ఉన్న‌త స్తాయి స‌మీక్ష స‌మావేశంలో సీఎం ఇప్ప‌టి నుంచే ఏర్పాట్లకు శ్రీ‌కారం చుట్టాల‌న్నారు. వ‌చ్చే ఏడాదిలో నిర్వ‌హించే ఈ గోదావ‌రి పుష్క‌రాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఉండాల‌న్నారు.
గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలో పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించేందుకు రాష్ట్రానికి వస్తారని అంచనా వేస్తున్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, పి నారాయణ, నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇటీవ‌ల టీటీడీ ఆధ్వ‌ర్యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వ‌హించార‌ని, వాటిని కూడా ప‌రిశీలించాల‌ని సూచించారు. ఇటీవ‌ల గ‌త ఏడాది దేశంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను కూడా ప్ర‌స్తావించారు. అలాంటి పొర‌పాట్లు రాకుండా గోదావ‌రి పుష్క‌రాల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించారు సీఎం.
The post గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bus Accident: కర్నూలులో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్దం ! 20 మందికి పైగా మృతి !Bus Accident: కర్నూలులో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్దం ! 20 మందికి పైగా మృతి !

Bus Accident : కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది (Bus Accident). హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన

జ‌న నాయ‌గ‌న్ కు అడుగ‌డుగునా అడ్డుంకులుజ‌న నాయ‌గ‌న్ కు అడుగ‌డుగునా అడ్డుంకులు

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను న‌టించిన తాజా చిత్రం జ‌న నాయ‌గ‌న్. జ‌న‌వ‌రి 9వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు అడ్డుపుల్ల వేసింది. ఈ

Vijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్‌ మాల్యా తీవ్ర విమర్శలుVijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్‌ మాల్యా తీవ్ర విమర్శలు

Vijay Mallya : బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్‌ మాల్యా (Vijay Mallya)… దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తుల రికవరీల