hyderabadupdates.com movies గ్రామ సచివాలయాలకు కొత్త పేరు, ప్రకటించిన సీఎం బాబు!

గ్రామ సచివాలయాలకు కొత్త పేరు, ప్రకటించిన సీఎం బాబు!

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ/ వార్డు సచివాలయాల పేరు మార్చేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రకటించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే విధంగా రూపకల్పన చేయాలి. అందుకే వాటిని విజన్ యూనిట్స్‌గా మార్చుతున్నాం. ఇవి భవిష్యత్తులో ప్రజా సేవలకు కేంద్ర బిందువుగా నిలుస్తాయ ని ఆయన తెలిపారు. మంత్రులు, అన్ని విభాగాల కార్యదర్శులతో సీఎం ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.

డేటా డ్రైవన్ గవర్నెన్స్ పై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏపీలో ప్రతి పౌరుడికి డిజిలాకర్రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పౌరుల అన్ని పత్రాలు డిజిలాకర్లో పొందుపరుస్తామన్నారు.  పౌరుల హెల్త్ డేటాను సైతం డిజిలాకర్లో పొందుపరుస్తామన్నారు. పోలీసు కేసులపై కూడా ఆ డిజిలాకర్లో పొందుపరచాలన్నారు. పోలీసు విభాగం వివరాలు డేటా లేక్తో అనుసంధించాలని సూచించారు.

విభాగాల వారీగా టెక్నాలజీ వినియోగానికి ఓనర్షిప్ తీసుకోవాలని అని సీఎం తెలిపారు. సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందిస్తామని అన్నారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చి సమర్థవంతంగా వాడాలని సూచించారు. ఇటీవల తుఫాను సమయంలో సాంకేతికతతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించగలిగామన్నారు. డేటా ఆధారిత పాలన అత్యంత కీలక అంశంగా మారిందని ఆయన తెలిపారు. ఏఐ వాడితే జీవోల ద్వారా లిటిగేషన్లు రాకుండా నివారించవచ్చిని సీఎం అభిప్రాయపడ్డారు.

క్వాంటం కంప్యూటర్ జనవరి నుంచే అమరావతిలో ప్రారంభిస్తామని అన్నారు. 2047 విజన్డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన సూచించారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత కావాలన్నారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్ధంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నాం అని తెలిపారు.

గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం అని సీఎం తెలిపారు. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉందన్నారు. ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం అన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం.. దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుందని సీఎం అన్నారు.

Related Post

గూగుల్‌ను కుదిపేస్తున్న.. ‘మ‌ద‌ర్ ఆఫ్ సైతాన్‌’: ఏంటిది?గూగుల్‌ను కుదిపేస్తున్న.. ‘మ‌ద‌ర్ ఆఫ్ సైతాన్‌’: ఏంటిది?

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా గూగుల్‌ను కుదిపేస్తున్న అంశం.. ‘మ‌ద‌ర్ ఆఫ్ సైతాన్‌’. ఏంటిది? ఎందుకు? ఎలా ఆవిర్భ‌వించింది? దీనివెనుక ఎవ‌రు ఉన్నారు? ఇలా.. అనేక అంశాల‌ను నెటిజ‌న్లు తెగ‌వెతికేస్తున్నారు. దీనికి కార‌ణం.. దేశంలో గ‌త నాలుగు రోజులుగా తీవ్ర చ‌ర్చ‌కు.. భ‌యానికి కూడా