hyderabadupdates.com movies ‘గ్లోబ్’ మొత్తం ఎదురు చూస్తున్న ‘ట్రాట్టింగ్’

‘గ్లోబ్’ మొత్తం ఎదురు చూస్తున్న ‘ట్రాట్టింగ్’

మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న గ్లోబ్ ట్రాట్టింగ్ ఈవెంట్ మొదలుకానుంది. రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు చూసి కళ్ళు తిరగడం ఒకటే తక్కువే. నాలుగు క్యాటగిరీలో పాస్ పోర్టుల పేరుతో పాసులు జారీ చేసి ఆ మేరకు వివిధ ఎంట్రీలు పెట్టి మరీ లోపలికి పంపిస్తున్నారు. రాజమౌళి చెప్పినట్టే అభిమానులు మధ్యాహ్నం నుంచే వేదిక వద్దకు చేరుకోవడం మొదలుపెట్టారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే జాతీయ రహదారి కావడంతో ఆలస్యం చేస్తే ఇరుక్కుపోతామనే ఉద్దేశంతో జాగ్రత్త పడుతున్నారు. జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ హక్కులు కొనేయడంతో ఏ ఇతర ఛానల్ లోనూ లైవ్ టెలికాస్ట్ ఉండదు.

ఇక ఈ ఈవెంట్ లో చాలా ఆకర్షణలు ఉండబోతున్నాయి. ప్రియాంకా చోప్రా డాన్స్ పెర్ఫార్మన్స్, శృతి హాసన్ లైవ్ కచేరి, ఎంఎం కీరవాణి ఆర్కెస్ట్రాతో పాటు రకరకాల ప్రోగ్రాంస్ ప్లాన్ చేశారట. రెండు రోజులగా సుమతో పాటు యాంకరింగ్ టీమ్ మొత్తం ఏకంగా వర్క్ షాప్ పెట్టుకుని మరీ ప్రాక్టీస్ చేస్తోంది. దీని తాలూకు ఫోటోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అసలైన టీజర్ లాంచ్ వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ మీద అట్టహాసంగా చేయబోతున్నారు. మహేష్ బాబు స్టేజి మీదకు వచ్చే ఘట్టాన్ని నెవర్ బిఫోర్ అనిపించేలా ఫైర్ వర్క్స్, ఫ్లడ్ లైట్స్, వందలాది జూనియర్ ఆర్టిస్టులతో చాలా స్పెషల్ గా డిజైన్ చేశారట.

చూసిన ప్రతిఒక్కరికి ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి ఇవ్వడానికి రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ బృందాలు అహోరాత్రాలు కష్టపడ్డారు. టైటిల్ తో పాటు విడుదల తేదీ కూడా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటిదాకా రివీల్ చేసిన క్యాస్టింగ్ లో మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ మాత్రమే ఉన్నారు. మిగిలిన ఆర్టిస్టులని ఇవాళ పరిచయం చేస్తారా లేదనేది సస్పెన్స్ గానే ఉంది. స్టేజి మీద టీజర్ ప్లే కాగానే దాన్ని ఆన్ లైన్ లోకి తీసుకురాబోతున్నారు. మహేష్ బాబు అభిమానులు నరాలు తెగిపోయే ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ నిరీక్షణకు తగ్గట్టే మైండ్ బ్లోయింగ్ కంటెంట్ ఉంటుందట.

Related Post

పవర్ స్టార్ పవర్ థియేటర్ లో మాత్రమే కాదుపవర్ స్టార్ పవర్ థియేటర్ లో మాత్రమే కాదు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్లోనే అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రం ఓజీ అంటే అతిశ‌యోక్తి కాదు. ఆ హైప్‌కు త‌గ్గ‌ట్లే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు సాధించిందా చిత్రం. ప‌వ‌న్ కెరీర్లో 200 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేర్