hyderabadupdates.com movies చంద్రగుప్తుడి చరిత్రతో దురంధర్ దర్శకుడు ?

చంద్రగుప్తుడి చరిత్రతో దురంధర్ దర్శకుడు ?

మూడు నెలల గ్యాప్ లో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన దర్శకుడిగా ఆదిత్య ధార్ పేరు దేశమంతా మారుమ్రోగిపోతోంది. ఇప్పటికిప్పుడు ఏ స్టార్ కి ఫోన్ చేసినా ఆఘమేఘాల మీద డేట్స్ ఇచ్చేలా ఉన్నారు. చాలా తక్కువ టైంలో ఇంత హై క్వాలిటీ మూవీ ఇవ్వడం చూసి ఎందరో డైరెక్టర్లకు కునుకు రావడం లేదు. ఫిలిం మేకింగ్ కి కొత్త డెఫినేషన్ ఇచ్చిన ఆదిత్య ధార్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ముంబై వర్గాల కథనాల ప్రకారం ఆదిత్య ధార్ ప్రస్తుతం చంద్రగుప్త మౌర్య కథ మీద వర్క్ చేస్తున్నారట. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన ఈ వీరుడి గాథలో అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పాటలీపుత్రని (ఇప్పటి పాట్నా) పాలించిన చంద్రగుప్తుడికి నందరాజుల చేతిలో అవమానాలు పొందిన చాణుక్యుడితో పరిచయం ఏర్పడ్డాక అత్యంత శక్తివంతుడిగా ఎదుగుతాడు. అలెగ్జాండర్ చనిపోయాక గ్రీకు ప్రతినిధులను ఓడించి పంజాబ్, సింధ్ లనుం సొంతం చేసుకుంటాడు.

జీవితం చివర్లో జైన మతాన్ని స్వీకరించిన చంద్రగుప్తుడు గొప్ప ఆదర్శాలను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈయన మనవడే అశోక చక్రవర్తి. తెలుగులో స్వర్గీయ ఎన్టీఆర్ ఈ బ్యాక్ డ్రాప్ లోనే స్వీయ దర్శక నిర్మాణంలో ఏఎన్ఆర్, శివాజీ గణేశన్ లతో కలిసి చాణక్య చంద్రగుప్తను భారీ బడ్జెట్ తో స్వంత బ్యానర్ లో తీశారు. కానీ అది ఫెయిల్ అయ్యింది. దూరదర్శన్ లో 90 దశకంలో వచ్చిన సీరియల్ పెద్ద హిట్టు. తర్వాత మళ్ళీ ఎవరూ ఈ సబ్జెక్టు జోలికి వెళ్ళలేదు.

ఇప్పుడు ఆదిత్య ధార్ దీని టేకప్ చేస్తే పెద్ద సాహసమే అవుతుంది. ఎందుకంటే తన మీద అంచనాలు మాములుగా లేవు. అయితే రీసెర్చ్ విషయంలో చాలా పక్కాగా ఉండే ఈ కల్ట్ దర్శకుడు ఎప్పడూ చూడని డీటెయిల్స్ చూపించడం మాత్రం ఖాయం. ఇప్పటికైతే ఇది ప్రచారంలోకి వచ్చింది కానీ ఎంతమేరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చేదాకా చెప్పలేం. అన్నట్టు చంద్రగుప్తుడిగా మొదటి ఛాయస్ ఎవరనుకుంటున్నారు. అదే జస్కి రాత్ అలియాస్ హంజా ఉరఫ్ రణ్వీర్ సింగే.

Related Post

A House of Dynamite Ending: What Really Happens in Kathryn Bigelow’s Netflix ThrillerA House of Dynamite Ending: What Really Happens in Kathryn Bigelow’s Netflix Thriller

Here’s why the ending is left ambiguous Netflix confirms that both Kathryn Bigelow and writer Noah Oppenheim intentionally withhold details about the missile’s source. Whether it was a nation, a

ప్రిమియర్స్ వద్దు.. రెగ్యులర్ షోలే ముద్దుప్రిమియర్స్ వద్దు.. రెగ్యులర్ షోలే ముద్దు

చిన్న సినిమాలకు రిలీజ్‌కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయడం కొన్నేళ్లుగా ట్రెండుగా మారింది. ఆ షోల నుంచి మంచి టాక్ వస్తే.. తొలి రోజు ఓపెనింగ్స్‌కు బాగా ప్లస్ అవుతోంది. సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి కూడా ఈ