hyderabadupdates.com Gallery చంద్ర‌బాబు నాకు ఓల్డ్ ఫ్రెండ్ : బిల్ గేట్స్

చంద్ర‌బాబు నాకు ఓల్డ్ ఫ్రెండ్ : బిల్ గేట్స్

చంద్ర‌బాబు నాకు ఓల్డ్ ఫ్రెండ్ : బిల్ గేట్స్ post thumbnail image

అమ‌రావ‌తి : బిల్ గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్ గేట్స్ ఆస‌క్తిక‌ర , స‌ర‌దా వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. సోమ‌వారం ఏపీని ద‌ర్శించారు బిల్ గేట్స్. త‌న‌కు గ్రాండ్ వెల్ కం ల‌భించింది. ఈ సంద‌ర్బంగా సెక్రటేరీయేట్లోని సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో సమావేశంలో పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు బిల్ గేట్స్. చంద్రబాబు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని సమావేశంలో సరదాగా వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఇన్నోవేషన్స్, వేగవంతమైన నిర్ణయాలు, చర్యలు అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. డిజిటల్ విప్లవానికి భారతదేశంలో బలమైన పునాదులు పడ్డాయన్నారు.
భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబు ఇచ్చారు బిల్ గేట్స్. తాను మొదటిసారి సీఎం చంద్రబాబును కలిసినప్పటి విషయాలను సమావేశంలో పంచుకున్నారు గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్. ప్రపంచ దేశాల్లో తాను కలిసిన ఎంతో మంది నాయకుల ఆలోచనల కంటే చంద్రబాబు ఆలోచనలు చాలా ముందున్నాయని తొలి భేటీలోనే గ్రహించినట్టు వెల్లడించారు. నాటి సింగపూర్ ప్రధాని కూడా చంద్రబాబు తరహా భిన్నమైన, విజన్‌తో కూడిన ఆలోచనలు చేసేవారని సమావేశంలో వివ‌రించారు. గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజార్టీ ప్రాజెక్టులని వివరించారు.
ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని స్ప‌ష్టం చేశారు బిల్ గేట్స్. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని సమావేశంలో మరోసారి కితాబు ఇచ్చారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో… తగిన స్థాయిలో విద్యా బోధన చేయడానికి AI సహయ పడుతుందని స్ప‌ష్టం చేశారు.
The post చంద్ర‌బాబు నాకు ఓల్డ్ ఫ్రెండ్ : బిల్ గేట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ex Minister Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదుEx Minister Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

Perni Nani : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై (Perni Nani) చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. మచిలీపట్నం ఆర్‌ఆర్‌ పేట పీఎస్‌లో సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేసాన్న అభియోగంపై పేర్ని నానితో సహా 29

ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్

యూఏఈ : త‌న ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతోందంటూ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు ప్ర‌ముఖ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఉన్న‌ట్టుండి యూఏఈ వేదిక‌గా ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. ఇందులో