hyderabadupdates.com movies చంద్రబాబు, పవన్, లోకేష్ పై అంత మాట అన్నారంటి జగన్?

చంద్రబాబు, పవన్, లోకేష్ పై అంత మాట అన్నారంటి జగన్?

ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ ముగ్గురు 420 చేష్టలు చేస్తున్నారని, వారిపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వెయ్యాలని షాకింగ్ కామెంట్లు చేశారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని జగన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు అన్ని బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పిన చంద్రబాబు గెలిచిన తర్వాత కొన్ని బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అని మోసం చేశారని దుయ్యబట్టారు.

ఇదే తరహాలో ఏదైనా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు మోసం చేస్తే వారిపై చీటింగ్ కేసు పెట్టి ఉండేవారు కదా అని జగన్ ప్రశ్నించారు. ఈ ముగ్గురి మోసాలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 రాయరని, వాళ్ళంతా ఒకటే దొంగల ముఠా అని, దోచుకుని పంచుకుని తింటుంటారని ఎద్దేవా చేశారు.

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కాకుండా రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారని, రెండేళ్లకు రూ.40 వేలు ఇస్తామన్నారని, ఇచ్చింది రూ.10 వేలు అని, ఇది మోసం కాదా? అని ప్రశ్నించారు.

తల్లికి వందనం లబ్ధిదారులను రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మందికి తగ్గించారని ఆరోపణలు చేశారు.నిరుద్యోగ భృతి కింద నెలకు 3 వేల చొప్పున రెండేళ్లకు 72 వేలు ఇవ్వాలని, ఇచ్చారా? అని ప్రశ్నించారు.18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18000ల చొప్పున రెండేళ్లకు రూ.36,000 ఇవ్వలేదని విమర్శించారు.

“చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరియు నారా లోకేష్ 420 చేష్టలు చేస్తున్నారు. ఈ ముగ్గురిని చీటింగ్ కేసు పెట్టీ బొక్కలో వెయ్యాలి.”– #YsJagan pic.twitter.com/BdJlYzKd4H— Gulte (@GulteOfficial) December 4, 2025

Related Post

Dhandoraa Sets Strong Release Plan, Proves the Power of Good ContentDhandoraa Sets Strong Release Plan, Proves the Power of Good Content

The upcoming Telugu film Dhandoraa is gearing up for a confident and well-planned theatrical release, backed by some of the most trusted names in film distribution. The makers have finalized