hyderabadupdates.com movies చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్ post thumbnail image

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా లేవంటూ సోషల్ మీడియాలో అభిమానులు తెగ చర్చించుకుంటూ ఉంటారు. కానీ సినిమా సంబంధిత విషయాలు ఎలా ఉన్నా కుటుంబ పరంగా కలవాల్సిన సందర్భాలు వచ్చినపుడు.. ఎంతో అన్యోన్యంగానే వ్యవహరిస్తుంటారు ఇరు కుటుంబాల సభ్యులు.

అల్లు వారి కుటుంబంలో మార్చి 6న ఒక శుభకార్యం జరగనున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ చిన్న కొడుకు శిరీష్ ఆ రోజే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. గత కొన్ని రోజులుగా పెళ్లి పనులు జోరుగా జరుగుతున్నాయి. ఓవైపు శుభలేఖలు పంచుతున్నారు. ఇంకోవైపు సంబరాలు జరుగుతున్నాయి. అల్లు బ్రదర్స్ కలిసి ఇటీవలే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ పార్టీలో రామ్ చరణ్ సైతం పాల్గొన్నాడు. ఐతే ఏటా ఈ సమయంలో చరణ్ స్వామి మాల వేస్తాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మాలలో ఉండే పార్టీకి హాజరయ్యాడు. ఐతే అందరూ మద్యం తాగే పార్టీకి స్వామి మాల వేసుకున్న చరణ్ ఎలా వచ్చేడనే ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో తలెత్తుతున్నాయి.

ఇన్‌స్టాలో తాజాగా ఒక నెటిజన్ ‘‘చరణ్ స్వామి’’ అంటూ ఒక కామెంట్ పెట్టాడు. ఐతే స్వామి మాల వేసుకుని పార్టీలో పాల్గొన్నాడని చరణ్ మీద ఎక్కడ అపవాదు పడుతుందో అని అల్లు శిరీష్ ఈ కామెంట్ మీద వెంటనే స్పందించాడు.

తమలో ఎవ్వరూ ఆల్కహాల్ ముట్టకముందే చరణ్ స్వామి ఈ పార్టీకి వచ్చాడని.. తమను విష్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని.. అయ్యప్పస్వామి పట్ల తన ప్రేమ, నిబద్ధత వేరని వ్యాఖ్యానించాడు.

చరణ్ మీద ఎలాంటి అపవాదు పడకుండా జాగ్రత్త పడ్డ శిరీష్ మీద మెగా, అల్లు ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిన నయనికను మార్చి 6న హైదరాబాద్‌లో పెళ్లాడబోతున్నాడు శిరీష్.

Related Post

“Dhandoraa” Teaser Creates Buzz: Cast Confident About December 25 Release“Dhandoraa” Teaser Creates Buzz: Cast Confident About December 25 Release

The teaser of “Dhandoraa” has created a strong buzz, with the entire team expressing huge confidence in the film at the teaser launch event. Produced by Ravindra Benarji Muppaneni under