hyderabadupdates.com movies చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి మైలేజ్ ఇచ్చింది. స్వప్న సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడిక్ డ్రామా డిసెంబర్ 25 విడుదల కానుంది. పెళ్లి సందడితో డెబ్యూ చేసిన రోషన్ మేక చాలా గ్యాప్ తీసుకుని తన రెండో మూవీతో వస్తున్నాడు. వైజయంతి సంస్థ బ్యాకప్ కావడంతో మంచి సపోర్ట్ తో థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే సాధారణ ప్రేక్షకులకు దీని గురించి తెలిసింది తక్కువే. అందుకే సోషల్ మీడియా అటెన్షన్ తెచ్చేందుకు చరణ్ హాజరు తీసుకోవడం అంచనాల పరంగా చాలా ప్లస్ కానుంది.

గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత చరణ్ పెద్దగా పబ్లిక్ ఈవెంట్స్ కి వస్తున్న దాఖలాలు తక్కువ. పెద్దిలో బిజీ అయిపోవడంతో దాని మీదే దృష్టి పెడుతున్నాడు. అయితే ఛాంపియన్ కోసం రావడం వెనుక కారణముంది. మొదటిదిది తన డెబ్యూ మూవీ చిరుత తీసింది ఫ్యామిలీకి ఎంతో దగ్గరైన నిర్మాత అశ్వినీదత్. పైగా స్వప్న, ప్రియాంకలతో కూడా ఫ్రెండ్ షిప్ ఉంది. రెండోది చిరంజీవికి బాగా ఇష్టుడైన శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో కావడం. గోవిందుడు అందరివాడేలేలో చరణ్ బాబాయ్ గా శ్రీకాంత్ కనిపించిన సంగతి తెలిసిందే. మాట్లాడిన కాసేపే అయినా తన ప్రసంగం ఆకట్టుకునేలా సాగింది. రోషన్ కు ఛాంపియన్ మరో మగధీర అవ్వాలని చెప్పాడు.

దత్తుగారితో ఉన్న అనుబంధం, తనలాంటి వ్యక్తులను నిజంగా నటులో కాదో చూసుకోకుండా ఎందరినో పరిచయం చేసి గొప్ప పునాది వేసిన ఉదంతాన్ని వివరించాడు. హీరోయిన్ అనస్వర రాజన్ గురించి గొప్పగా చెబుతూ ఇకపై టాప్ డైరెక్టర్స్, బ్యానర్స్ నుంచి అవకాశాలు వస్తాయని పొగడటంతో ఆ అమ్మాయి ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. శ్రీకాంత్ తో బాండింగ్ గురించి కూడా వివరించిన చరణ్ పెద్ది రిలీజ్ డేట్ మరోసారి మార్చి 27 కన్ఫర్మ్ చేశాడు. అప్డేట్స్ అడగొద్దని, సంక్రాంతి హడావిడి అయిపోయిన తర్వాత ఏదో ఒక టైం తీసుకుని దూరిపోతామని సరదాగా తేల్చేశాడు. వచ్చే వారం ఛాంపియన్ ఏం చేస్తుందో చూడాలి మరి.

Related Post

Dhanush and Nagarjuna’s Kuberaa scores impressive TRP on TV debutDhanush and Nagarjuna’s Kuberaa scores impressive TRP on TV debut

Kollywood actor Dhanush’s social drama Kuberaa, directed by Sekhar Kammula, worked big time in Telugu and collected over Rs. 120 crores in its lifetime across all versions. King Nagarjuna played