hyderabadupdates.com movies చికాకుల‌కు చెక్ పెట్ట‌క‌పోతే… నేత‌లను కట్ చేసేస్తారు!

చికాకుల‌కు చెక్ పెట్ట‌క‌పోతే… నేత‌లను కట్ చేసేస్తారు!

కూటమి ఎలా ఉండాలి కూటమి సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి పార్టీ నాయకులు ఎలా ఉండాలి అనే విషయాలపై తరచుగా సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్నారు. అందరూ కలివిడిగా ఉండాలని క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి పనిచేయాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు దీనికోసం సమన్వయ కమిటీలను కూడా క్షేత్రస్థాయిలో నియమించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ పని చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ కలివిడికి సంబంధించి కూటమి నాయకుల మధ్య ఐక్యతకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ వేదికగానే సంచలన వ్యాఖ్యలు చేయడం గ‌మ‌నార్హం.

ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు కూటమి పార్టీలకు దిశా నిర్దేశం చేసినట్టుగా భావించాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి 20 మాసాలు గడిచిపోయాయి. మరో 30 మాసాలు మాత్రమే ప్రభుత్వానికి సమయం ఉంది. ప్రజలకు చేరువ కావడం, ప్రజల సమస్యలను పరిష్కరించటం ముఖ్యంగా మూడు పార్టీలు కలిసే ఉన్నాయన్న బలమైన సంకేతాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి అన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన ఉద్దేశం గా ఉంది.

ఒకవైపు చంద్రబాబు చెబుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై మరింత ఎక్కువగా స్పందించడం, ఘాటుగా చెప్పడం ద్వారా కూటమి పార్టీల నాయకులకు ఆయన సరైన సంకేతాలను ఇచ్చినట్టు అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపై క్షేత్రస్థాయిలో నాయకులు కలివిడిగా లేకపోతే అది వారికే నష్టాన్ని తీసుకువస్తున్నటువంటి ప్రధాన అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు చంద్రబాబు చెబుతున్న మాటలను కొందరు లైట్ తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా కచ్చితంగా అసెంబ్లీ వేదికగానే కూటమి ఐక్యతను బలంగా ప్రస్తావించడం ద్వారా నాయకులకు కీలక సంకేతాలు ఇచ్చినట్టు అయిందని వ్యాఖ్యానిస్తున్నారు.

కాబట్టి క్షేత్రస్థాయిలో ఇక నాయకులు కలివిడిగా ఉండటమా లేక విడిపోవడం అనేది వ్యక్తిగత అంశాలు గానే చూడాల్సి ఉంటుంది తప్ప కూటమిగా అయితే పార్టీలు కలిసే ఉంటాయన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారని దీనిపై రెండో మాట లేదని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిని బట్టి నాయకులు ఏం చేస్తారనేది ఇక వారి తేల్చుకోవాలని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కూటమి నాయకుల పరిస్థితి భిన్నంగానే ఉందన్నది వాస్తవం.

ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చాలా నియోజకవర్గాల్లో అంతర్గత కొమ్ములాటలు ఆధిప‌త్య పోరు, రాజకీయాలు, వాటాల్లో పంపకం ఇట్లా రక రకాల కారణాలతో నాయకుల మధ్య చికాకులు గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వాటికి చెక్ పెట్టకపోతే వచ్చే ఎన్నికల నాటికి వారికే చెక్ పెట్టే పరిస్థితి వస్తుందన్నది పవన్ కళ్యాణ్ మాటల అంతరార్థంగా నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Related Post

2004 గాయం మర్చిపోలేదా? ఇక మళ్లీ జరగదన్న చంద్రబాబు2004 గాయం మర్చిపోలేదా? ఇక మళ్లీ జరగదన్న చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో జరిగిన ఎన్నికల్లో అనేక కారణాల వల్ల ఓడిపోయామని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తున్నామని అన్నారు. 2004కు ముందు కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, అది రాష్ట్రానికి మంచి ఫలితాలు తీసుకువచ్చినా

జాగృతితో పెట్టుకుంటే జాగ్ర‌త్త: క‌విత వార్నింగ్ వాళ్ళకేనా?జాగృతితో పెట్టుకుంటే జాగ్ర‌త్త: క‌విత వార్నింగ్ వాళ్ళకేనా?

`తెలంగాణ జాగృతి` అధ్య‌క్షురాలు.. మాజీ ఎంపీ క‌విత అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ నాయ‌కుల‌ను తీవ్రంగా హెచ్చ‌రించారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు మంచివేన‌ని.. కానీ, హద్దు మీరి త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తే మాత్రం తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని

The Raja Saab: Four-hour raw footage; one hour trimmed due to runtime issuesThe Raja Saab: Four-hour raw footage; one hour trimmed due to runtime issues

Prabhas’ next theatrical release, The Raja Saab, is a horror-fantasy entertainer directed by Maruthi. The film is slated to hit the big screens on January 9, 2026, with paid premieres