hyderabadupdates.com Gallery చిరాగ్ పాశ్వాన్ తో రొమాన్స్ అబ‌ద్దం : కంగ‌నా ర‌నౌత్

చిరాగ్ పాశ్వాన్ తో రొమాన్స్ అబ‌ద్దం : కంగ‌నా ర‌నౌత్

చిరాగ్ పాశ్వాన్ తో రొమాన్స్ అబ‌ద్దం : కంగ‌నా ర‌నౌత్ post thumbnail image

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు, వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌నంగా మారారు. త‌ను ప్ర‌స్తుతం దివంగ‌త రాజ‌కీయ నేత రామ్ విలాస్ పాశ్వాన్ త‌న‌యుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ తో ప్రేమ‌లో ప‌డింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఈ ఇద్ద‌రూ గ‌త కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నార‌ని సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. దీనిపై తాజాగా స్పందించారు ఎంపీ కంగ‌నా ర‌నౌత్. తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని, అంత‌కు మించి తామిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ అనేది లేనేలేద‌ని స్ప‌ష్టం చేసింది న‌టి. ఇదంతా ఎవ‌రో కావాల‌ని త‌న‌పై ప్ర‌చారం చేస్తున్నారంటూ వాపోయింది కంగ‌నా ర‌నౌత్.
అయితే అగర్ ఐసా హోతా తో ఆజ్ హుమారే బచ్చే హోతే అంటూ పేర్కొన్నారు. రాజకీయ నాయకురాలుగా మారిన నటి కంగనా రనౌత్ తన తోటి రాజకీయ నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌తో తనకున్న సంబంధంపై కొనసాగుతున్న ఊహాగానాలకు పుల్ స్టాప్ పెట్టేసింది. కాగా ప్రత్యేకించి ఇద్దరూ పబ్లిక్ ఈవెంట్‌లలో కలిసి కనిపించారు. దీంతో అభిమానులలో మ‌రింత‌ ఆసక్తిని రేకెత్తించారు. అయితే, కంగనా ఇప్పుడు ఈ కబుర్లను నేరుగా ప్రస్తావించడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తాజాగా జాతీయ మీడియా ఏఎన్ ఐ ఛానల్ తో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్భంగా ప్ర‌స్తావించింది. రొమాన్స్ అనేది త‌న‌తో లేద‌ని స్ప‌ష్టం చేసింది. చిరాగ్ పాశ్వాన్ త‌న‌కు స్నేహితుడ‌ని కానీ ల‌వ‌ర్ మాత్రం కాద‌న్నారు.
The post చిరాగ్ పాశ్వాన్ తో రొమాన్స్ అబ‌ద్దం : కంగ‌నా ర‌నౌత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానంశివరాత్రి బ్రహ్మోత్సవాల‌కు సీఎంకు ఆహ్వానం

అమరావతి : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీ‌శైలం పుణ్య‌క్షేత్రం. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, తమిళ‌నాడు, త‌దిత‌ర రాష్ట్రాల నుంచి

Minister Vivek: వివేక్‌, హరీశ్‌ రావుల మధ్య మాటల యుద్ధంMinister Vivek: వివేక్‌, హరీశ్‌ రావుల మధ్య మాటల యుద్ధం

Minister Vivek : ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలపై మంత్రి గడ్డం వివేక్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. సిద్దిపేట కలెక్టరేట్‌లో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

CM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలుCM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.