hyderabadupdates.com movies చిరు సినిమా… చేతులు మారుతుందా?

చిరు సినిమా… చేతులు మారుతుందా?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్‌కు కవల పిల్లలు పుట్టడం ఆనందాన్ని రెట్టింపు చేసేదే. ఈ ఊపులో బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఐతే ఈ సినిమాకు అనుకోని అడ్డంకులు తలెత్తేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ఒక నిర్మాత చేతి నుంచి మరొకరి చేతికి వెళ్తుందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

చిరు-బాబీ సినిమాను నిర్మించాల్సిన కన్నడ నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత కె.నారాయణ. గత రెండేళ్లలో ఆయన కొన్ని క్రేజీ ప్రాజెక్టులను మొదలుపెట్టారు. అందులో ఒకటి.. జననాయగన్. తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ తన చివరి చిత్రాన్ని నారాయణ బేనర్లోనే చేశారు. ఈ సినిమాకు బంపర్ క్రేజ్ వచ్చింది. బిజినెస్ వేరే లెవెల్లో జరిగింది. కానీ ఈ చిత్రం అనూహ్యంగా చిక్కుల్లో పడింది. సెన్సార్ సమస్యలతో దీని రిలీజ్ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నారు.

ఈ చిత్రానికి ఎప్పుడో భారీ స్థాయిలో బిజినెస్ జరగ్గా.. ఇప్పుడు ఆ అగ్రిమెంట్లు ఒక్కొక్కటిగా క్యాన్సిల్ అవుతున్నాయి. ఒక్కొక్కరుగా డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గుతున్నారు. దీంతో వారికి రీఫండ్ చేస్తున్నారు. కొందరు బయ్యర్లేమో పాత అగ్రిమెంట్లను రివైజ్ చేయమంటున్నారు. థియేటర్లకు కూడా చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. దీనికి తోడు సినిమా మూణ్నాలుగు నెలలు ఆలస్యం కావడం వల్ల భారీగా వడ్డీల భారం పడబోతోంది.

మొత్తంగా ఈ వ్యవహారం వల్ల భారీ నష్టమే వాటిల్లుతుందని అంచనా. కేవీఎన్ సంస్థకు ఇప్పుడు నిధుల సమస్య తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. పైగా ‘జననాయగన్’ లీగల్ గొడవల్లో ఆ సంస్థ తలమునకలై ఉండగా.. మరోవైపు ‘టాక్సిక్’ను రిలీజ్‌కు రెడీ చేయాల్సి ఉంది, దాని బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంది.

దీంతో చిరు-బాబీ సినిమాను ముందుకు తీసుకెళ్లడంలో ఆ సంస్థకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టడం లేదంటే.. ఈ ప్రాజెక్టు నుంచి వాళ్లు బయటికి వెళ్లిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. చిరు-బాబీ మూవీకి బంపర్ క్రేజ్ ఉంది కాబట్టి.. కేవీఎన్ కాదంటే వారికి సెటిల్ చేసి, ఈ ప్రాజెక్టును టేకప్ చేయడానికి టాలీవుడ్లో చాలా ప్రొడక్షన్ హౌస్‌లు రెడీగా ఉన్నాయి.

Related Post

రజినీ-కమల్ చూపు.. తెలుగు వైపు?రజినీ-కమల్ చూపు.. తెలుగు వైపు?

సౌత్ ఇండియాలో ఎన్నో దశాబ్దాల నుంచి దర్శకులు అవుతున్న వాళ్లంతా తప్పక ఒక్క సినిమా అయినా చేయాలని ఆశించే హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు ముందు వరుసలో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి హీరో కొత్త సినిమాకు ఇప్పుడు సరైన

Chiranjeevi–Mohanlal Gangster Film Buzz Sparks Box Office CuriosityChiranjeevi–Mohanlal Gangster Film Buzz Sparks Box Office Curiosity

Strong buzz is building around an upcoming big-ticket project that brings together Chiranjeevi and Mohanlal for the first time. Though the makers are yet to make an official announcement, industry