కోల్ కతా : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా కోల్ కతా వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు 2వ మ్యాచ్ లో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో మట్టి కరిచింది. దీంతో జూలు విదిల్చింది ఎస్ ఆర్ హెచ్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది కోల్ కతా నైట్ రైడర్స్. ఈ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 227 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా ఆదిలోనే చేతులెత్తేసింది. 16 ఓవర్లలోనే 161 పరుగులకే చాప చుట్టేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో నితీశ్ ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ సూపర్ షో చేశాడు. తను 35 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు ఒక సిక్స్ తో చెలరేగాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. తను 52 పరుగులు చేశాడు. ఇండియన్ యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ 21 బాల్స్ ఎదుర్కొని దుమ్ము రేపాడు. 4 ఫోర్లు, 4 సిక్సులతో రెచ్చి పోయాడు. తను 48 రన్స్ చేశాడు. 2 పరుగుల దూరంలో తను హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ 6 ఫోర్లు 3 సిక్సులతో రెచ్చి పోయాడు . ఇందులో 6 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. మైదానంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో రఘువంశీ తప్పా ఏ ఒక్కరూ నిలవలేక పోయారు.
The post చెలరేగిన హైదరాబాద్ తలవంచిన కోల్ కతా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
చెలరేగిన హైదరాబాద్ తలవంచిన కోల్ కతా
Categories: