hyderabadupdates.com movies ‘ఛాంపియన్’ జోడికి సక్సెస్ చాలా అవసరం

‘ఛాంపియన్’ జోడికి సక్సెస్ చాలా అవసరం

డిసెంబర్ 25 విడుదల కాబోతున్న ఛాంపియన్ మీద ఇంతకు ముందు ఏమో కానీ ట్రైలర్ వచ్చాక అంచనాలు ఏర్పడ్డాయి. సాధారణ ప్రేక్షకులకు కాన్సెప్ట్ ఏంటో ఐడియా వచ్చింది. పీరియాడిక్ డ్రామా అయినప్పటికీ ఇంత గ్రాండ్ గా తెరకెక్కించారా అంటూ ఆశ్చర్యపోయినవాళ్ళే ఎక్కువ. ఎంత స్వప్న, వైజయంతి సంస్థల ప్రొడక్షన్ అయినప్పటికీ కేవలం ఒక్క సినిమా అనుభవమున్న హీరో రోషన్ మేక మీద ఇంత ఖర్చు పెట్టడం విశేషమే. అఖండ 2 వైఫల్యం తర్వాత బాక్సాఫీస్ వద్ద వ్యాక్యూమ్ ఏర్పడిన నేపథ్యంలో దాన్ని వాడుకుంటే ఛాంపియన్ కు ఓపెనింగ్స్ తో పాటు మంచి వసూళ్లు దక్కుతాయి.

ఇదంతా బాగానే ఉంది కానీ ఛాంపియన్ పబ్లిసిటీలో హీరోయిన్ అనస్వర రాజన్ కు తగినంత ప్రాధాన్యం దక్కిందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. గిర గిర పాటలో వేసిన ఒక స్టెప్ తో వైరల్ అయిపోయింది. ప్రమోషన్స్ లోనూ రోషన్ ను డామినేట్ చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు.

మలయాళం నుంచి వచ్చిన ఆమె మనకు కొత్త కానీ మల్లువుడ్ లో చాలా సినిమాలే చేసింది. ఓటిటి కంటెంట్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు సూపర్ శరణ్యలో తన పెర్ఫార్మన్స్ గుర్తుండే ఉంటుంది. ఇదే కాదు చాలా హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. ఐఫా, ఫిలిం ఫేర్ లాంటి పురస్కారాలు వరించాయి. అనస్వర రాజన్ కమిట్ మెంట్ ఏ స్థాయిలో ఉందంటే తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పుకుంది. ఈ విషయం మొన్న ఈవెంట్ లో రామ్ చరణ్ స్వయంగా చెప్పాడు.

ఇప్పుడు కనక ఛాంపియన్ బ్రేక్ ఇస్తే అనస్వర రాజన్ కు తెలుగులో మంచి వెల్కమ్ దక్కుతుంది. పెళ్లి సందడి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రోషన్ మేకకు ఇది హిట్ కావడం చాలా అవసరం. లక్కీగా అనస్వర రాజన్ లాంటి నటించే అమ్మాయి దొరకడం ఒక రకంగా లక్ అని చెప్పాలి. పెళ్లి సందడితో పరిచయమైన శ్రీలీల ఎంత బిజీ ఆర్టిస్ట్ అయ్యిందో చూస్తున్నాం. ఇప్పుడీ అనస్వరకు అలాంటి బ్రేక్ దొరుకుతుందేమో చూడాలి. స్వాతంత్రం రాక ముందు, వచ్చిన తర్వాత తెలంగాణలోని భైరాన్ పల్లి అనే గ్రామంలో నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ ఛాంపియన్ తెరకెక్కించారు.

Related Post

అభివృద్ధికి ఆటంకాలు ఎందుకు జగన్?అభివృద్ధికి ఆటంకాలు ఎందుకు జగన్?

ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాలని కుయుక్తులు పన్నుతోందంటూ టీడీపీ నేతలు అంటున్నారు. వారి వాదనలకు బలాన్ని చేకూర్చేలా విశాఖపట్నంలో ఐటీ పార్క్

గంటా వారి అలక తీరినట్టేనా..!గంటా వారి అలక తీరినట్టేనా..!

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అలక తీరిందా? తిరిగి ఆయ‌న సాధారణ స్థితిలోకి వచ్చారా? ఇక రాజకీయాలను యాక్టివ్ చేయనున్నారా? అంటే ఔనే అనే సమాధానే వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పట్టుబట్టి భీమిలి నుంచి