hyderabadupdates.com movies ఛాంపియన్ లో ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?

ఛాంపియన్ లో ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?

అవంతిక వందనపు.. తెలుగులో బాల నటిగా నటించి.. ఆ తర్వాత మాయమైన ఈ అమ్మాయి గత ఏడాది హాలీవుడ్ మూవీలో మెరిసి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. బాల నటిగా బ్రహ్మోత్సవం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో మెరిసిన అవంతిక.. ‘స్పిన్’; ‘మీన్ గర్ల్స్’ చిత్రాలతో హాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

క్యూట్‌గా కనిపించే చిన్నపాపలా తెలుగు ప్రేక్షకులకు గుర్తున్న అవంతిక.. ‘మీన్ గర్ల్స్’ కోసం చేసిన హాట్ డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఈ సినిమా ప్రమోషన్లలో అవంతిక లుక్స్, తన అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్ చూసి మన వాళ్లు దిమ్మదిరిగింది. ఐతే రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లా ఉండాలన్న సామెతను గుర్తు చేస్తూ పక్కా హాలీవుడ్ హీరోయిన్ లాగా దర్శనమిచ్చిన అవంతిక.. ఇప్పుడు తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది. క్రిస్మస్ వీకెండ్లో రాబోతున్న ‘ఛాంపియన్’ సినిమాలోస్పెషల్ రోల్ చేసింది అవంతిక.

‘ఛాంపియన్’ నుంచి తాజాగా ఒక డ్యాన్స్ నంబర్ రిలీజ్ చేశారు. అందులో హీరో రోషన్ మేకతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది అవంతిక. తన డ్యాన్స్ మూమెంట్స్ చూసి అందరూ షాకయ్యారు. మంచి ఎనర్జీ చూపించింది స్టెప్స్‌లో అవంతిక. తన హాట్ లుక్స్ కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నాయి. బాలనటిగా క్యూట్ అనిపించిన అమ్మాయి తనేనా అని ఆశ్చర్యపోయేలా ఉన్న తన లుక్స్, స్టెప్స్.

ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తే అవంతికకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావచ్చు. హాలీవుడ్లో సినిమాలు చేసినా అవంతిక తెలుగునేమీ మర్చిపోలేదు. ఈ హైదరాబాద్ అమ్మాయి తెలంగాణ యాస మాట్లాడగలదు. ‘ఛాంపియన్’లో తనది పెద్ద రోలేమీ కాదని తెలుస్తోంది. చిన్న పాత్రలో అయినా తనదైన ముద్ర వేస్తే ఇక్కడ ఛాన్సులకేమీ లోటు ఉండకపోవచ్చు.

Related Post

Cibi Chakaravarthi to Direct Rajinikanth’s Thalaivar173, Produced by Kamal HaasanCibi Chakaravarthi to Direct Rajinikanth’s Thalaivar173, Produced by Kamal Haasan

A major announcement has set the Indian film industry buzzing as Cibi Chakaravarthi has been officially named the director of #Thalaivar173, starring Rajinikanth in the lead. The prestigious project will

గంటా వారి అలక తీరినట్టేనా..!గంటా వారి అలక తీరినట్టేనా..!

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అలక తీరిందా? తిరిగి ఆయ‌న సాధారణ స్థితిలోకి వచ్చారా? ఇక రాజకీయాలను యాక్టివ్ చేయనున్నారా? అంటే ఔనే అనే సమాధానే వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పట్టుబట్టి భీమిలి నుంచి