hyderabadupdates.com movies ‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి లేకపోతే). అయితే ఆ రెండు ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న విషయంపై వైసీపీ నేతలకు ఓ స్పష్టమైన అవగాహన అయితే ఉన్నట్టుంది. ఎందుకంటే… ఏపీలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావులు మరోమారు సీఎంలుగా కొలువుదీరతారన్న అర్థం వచ్చేలా వైసీపీ నేతలు చెబుతున్నారు.

తాము వచ్చాక ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నేతలతో పాటు వారికి వంత పాడుతున్న నేతలకు చుక్కలు చూపిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని ఆరో వార్డులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని ఇళ్లను గురువారం మునిసిపల్ అధికారులు కూల్చేశారు. ఈ విషయం తెలుసుకున్న నాని… హుటాహుటీన అక్కడకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాల్ రావుల పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు. ఇళ్లను కూలిస్తే పేదల పరిస్థితి ఎలా ఉంటుందో సరిగ్గా అలాంటి పరిస్థితినే బాపిరాజు, గోపాల్ రావులకు చూపిస్తానని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

బాపిరాజు కులాన్నికూడా ప్రస్తావించిన నాని… ఆయనను సీఎం నారా చంద్రబాబునాయుడి బంధువుగా అభివర్ణించారు. 2029 ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బాపిరాజును తిరిగి మచిలీపట్నానికి రప్పించి పేదల బాధ ఎలా ఉంటుందో తెలియజేస్తానని అన్నారు.

ఇక గోపాల్ రావు పేరును మరింతగా బిగ్గరగా ప్రస్తావించిన నాని… తాము అధికారంలోకి వచ్చాక… గోపాల్ రావు ఎక్కడున్నా.. మచిలీపట్నానికి పోస్టింగ్ ఇప్పించి గోపాల్ రావు ఇంటి కథ తేలుస్తామని హెచ్చరించారు. ఒకవేళ గోపాల్ రావు తెలంగాణకు పారిపోయినా…కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా గోపాల్ రావును మచిలీపట్నానికి తీసుకువస్తానని నాని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా నాని చేసిన వ్యాఖ్యలు… ఆయన నోట నుంచి వచ్చిన 2029 ఎన్నికలు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 2029 ఎన్నికల్లో వైసీపీ తప్పనిసరిగా విజయం సాధిస్తుందన్న భావన వినిపించేలా నాని కామెంట్ చేశారు. అదే సమయంలో కేసీఆర్ పేరును ప్రస్తావించిన నాని… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజంయ సాధించడం ఖాయమన్నట్లుగా ఆయన పేర్కొనడం గమనార్హం. మొత్తంగా ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ లు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపడతారని నాని ఆసక్తికర కామెంట్లు చేశారు.

Related Post

ఆ దేశ మాజీ ప్రధానికి ఉరిశిక్ష ఖరారుఆ దేశ మాజీ ప్రధానికి ఉరిశిక్ష ఖరారు

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు ఐసీటీ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఢాకా అల్లర్ల కేసులో హసీనాకు ఈ శిక్ష విధించారు. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం తీసుకుంటోంది. షేక్‌ హసీనా తీరు మానవత్వానికి మచ్చ అని ఈ సందర్భంగా

Mahakali Rises: Prasanth Varma Unveils the Next Power from the World of Hanu-ManMahakali Rises: Prasanth Varma Unveils the Next Power from the World of Hanu-Man

The Prasanth Varma Cinematic Universe (PVCU) is growing stronger! After the massive success of Hanu-Man, director Prasanth Varma and RKD Studios have officially revealed their next big superhero film —