hyderabadupdates.com movies జగన్ మావిగన్… ఇప్పుడు సినిమా అయిపోయింది

జగన్ మావిగన్… ఇప్పుడు సినిమా అయిపోయింది

మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం నిన్నటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత వైరల్ అయిపోయింది. 2014 ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని తొలిసారి రాజధానిగా ప్రకటించినపుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అంటూ ప్రకటించి, 2019లో అధికారంలోకి వచ్చాక యుటర్న్ తీసుకుని మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి నాశనానికి పూనుకున్న జగన్.. ఇప్పుడు మళ్లీ ‘మావిగన్’ పేరుతో కొత్త పల్లవి అందుకున్నారు.

అమరావతిని శాశ్వత రాజధానిగా తీర్మానిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలోనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి ‘మావిగన్’ అనే క్యాపిటల్ కారిడార్‌గా ప్రకటించాలంటూ విచిత్రమైన వాదన తీసుకొచ్చారు జగన్. ఈ ప్రతిపాదనే కాదు.. విచిత్రమైన ఆ పదం కూడా అందరినీ విస్మయానికి గురి చేసింది. జగన్ ఈ ప్రపోజల్ పెట్టిన కాసేపటికే పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. గత 24 గంటలకు జగన్‌ మీద ట్రోల్స్ మామూలుగా లేదు.

ఈ ట్రోల్స్ పుణ్యమా అని సోషల్ మీడియాలో ‘మావిగన్’ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో సినిమా వాళ్లు కూడా అలెర్ట్ అయిపోయారు. గురువారం ఉదయం ఒక నిర్మాత తెలుగు ఫిలిం ఛాంబర్లో ‘మావిగన్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ముందు ఈ వార్త ఫేక్ అనుకున్నారు చాలామంది. కానీ నిజంగానే ఓ ప్రొడ్యూసర్ ఈ పేరును రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ట్రోల్స్‌, జోక్స్‌ను సినిమాల కోసం వాడుకోవడం కొన్నేళ్లుగా నడుస్తున్న ట్రెండ్.ఐతే జోకుల వరకు ఓకే కానీ.. ఏకంగా ‘మావిగన్’ అనే పేరునే సినిమా టైటిల్‌ కోసం వాడుకోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఈ పేరుతో నిజంగా సినిమా తీస్తారా అన్నది ప్రశ్నార్థకమే.

వైరల్ అవుతోంది కాబట్టి.. ముందు టైటిల్ అయితే రిజిస్టర్ చేసేశారు. అందుకు తగ్గ కథ ఉంటే సినిమా తీయొచ్చు. లేదా ఎవరైనా ఆ టైటిల్ పెట్టుకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు. ఈ ఉద్దేశంతోనే ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయించి ఉంటారని భావిస్తున్నారు. కానీ కొందరేమో జగన్ ప్రతిపాదించిన పేరు.. సినిమా టైటిల్ అయిపోయిందంటే, ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చూశారా అంటూ వైసీపీ అధినేతకు ఎలివేషన్లు ఇస్తుండడం విశేషం.

Related Post

ఇండియాకి ఏపీ గేట్ వే: నారా లోకేష్‌ఇండియాకి ఏపీ గేట్ వే: నారా లోకేష్‌

ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి నారా లోకేష్‌.. అక్క‌డి పెట్టుబ‌డి దారుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నంలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే సీఐఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన రోడ్ షోలో పాల్గొని.. పెట్టుబ‌డి దారుల తో చ‌ర్చ‌లు జ‌రిపారు. తాజాగా మ‌రో కీల‌క మైలురాయిని ఆయ‌న చేరుకున్నారు.

Legend Returns: Singeetam Srinivasa Rao’s New Film Sparks Massive BuzzLegend Returns: Singeetam Srinivasa Rao’s New Film Sparks Massive Buzz

The legendary filmmaker Singeetam Srinivasa Rao, known for creating some of Indian cinema’s most timeless classics, is all set to return with an ambitious new project that has already created