hyderabadupdates.com Gallery జ‌గ‌న్ రెడ్డివ‌న్నీ అబ‌ద్దాలే : జ‌నార్ద‌న్ రెడ్డి

జ‌గ‌న్ రెడ్డివ‌న్నీ అబ‌ద్దాలే : జ‌నార్ద‌న్ రెడ్డి

జ‌గ‌న్ రెడ్డివ‌న్నీ అబ‌ద్దాలే : జ‌నార్ద‌న్ రెడ్డి post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు ఏపీపై ప్రేమ లేద‌న్నారు. రోజుకో మాట మాట్లాడుతూ ప్రజ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌యత్నం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. పూటకో ఈవెంట్ తో వైసిపి నేతలు తమ కరపత్రికను అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. సీఎం చంద్రబాబు ప్రతి మూడు నెలలకు ఒకసారి పోర్టుల పురోగతిపై రివ్యూ చేస్తూ ఉన్నారని చెప్పారు. ఎంతో క‌ష్ట‌ప‌డితే త‌ప్పా అమ‌రావ‌తికి లైన్ క్లియ‌ర్ కాలేదన్నారు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. 2024 జూన్ నాటికి పోర్టు భౌతిక పురోగతి.. మొత్తం 25.02 % గా ఉండగా.. ప్రస్తుతం 74.65 % పనులు శరవేగంగా పూర్తి చేశామని చెప్పగలం అన్నారు… గత 20 నెలల్లో దాదాపు 49.63 % పనులు పూర్తి చేశాం అన్నారు.
ఆర్థిక పురోగతి 2019–24 లో రూ. 718.50 కోట్లు వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే.. ప్రస్తుతం రూ. 1835.98 కోట్ల మేర పనులు చేపట్టడం జరిగిందన్నారు. మొత్తంగా గత 20 నెలల పాలనలో రూ. 1117.48 కోట్లు వెచ్చించాన‌ని తెలిపారు. పోర్టుకు సంబంధించి ఉప్పు భూముల సేకరణ విషయంలో నాటి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎటువంటి ప్రయత్నం చేసిన పాపాన పోలేదన్నారు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, 385.24 ఎకరాల భూసేకరణకు అనుమతి పొందడం జరిగింద‌న్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మూలాపేట, విష్ణుచక్రం గ్రామాల్లో పునరావాసం కోసం సీరియస్ గా ఎటువంటి చర్యలు చేపట్ట లేద‌న్నారు మంత్రి. గత 20 నెలల కూటమి ప్రభుత్వంలో విష్ణుచక్రం గ్రామంలో పూర్తిగా పునరావాసం కల్పించడం జరిగిందన్నారు. అలాగే మూలపేట గ్రామంలో పునరావాసం పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయన్నారు.
The post జ‌గ‌న్ రెడ్డివ‌న్నీ అబ‌ద్దాలే : జ‌నార్ద‌న్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలిహోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నగరంలో హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయ‌న హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి ఆయన

Sabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారంSabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారం

    కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో పెద్దఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నారు. మలికప్పురం ఆలయం వెనుక ఉన్న ఈ సత్రంలో

Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా 

Palla Srinivasarao : విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి తాను కూర్చున్న స్టేజి కూలిపోయిన ఘటన వెనుక ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉందని శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే