hyderabadupdates.com movies జగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయి

జగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయనే చెప్పాలి. మొన్నటికి మొన్న జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా జగ్గారెడ్డిని జైలు పాలు చేసిన ఓ కీలక కేసులో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం నమోదు అయిన సదరు కేసులో జగ్గారెడ్డికి పాత్ర ఉన్నట్టు సాక్ష్యాలు లేవంటూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సంచలన తీర్పును వెల్లడించింది. వెరసి ఆ కేసులో జగ్గారెడ్డికి బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పాలి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి చెందిన వ్యక్తులను విదేశాలకు అమ్ముతున్నారంటూ ఓ సంచలన కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి కూడా పాలుపంచుకున్నారని నాటి టీఆర్ఎస్ సర్కారు కేసు నమోదు చేసింది. నాడు ఈ కేసులో జగ్గారెడ్డి అరెస్టు కూడా అయ్యారు.

ఆ తర్వాత కొంత కాలానికి ఆయన బెయిల్ పై విడుదల అయినా కేసు మాత్రం ఏళ్ల తరబడి కొనసాగింది. ఈ కేసులో జగ్గారెడ్డితో పాటు పార్టీకి చెందిన మరో సీనియర్ నేత కుసుమ కుమార్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును ఎనిమిదేళ్లుగా విచారించిన కోర్టు… వీరిద్దరిపై తగిన సాక్ష్యాధారాలు లేవని కేసును కొట్టివేస్తూ గురువారం తీర్పు చెప్పింది.

తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పక తప్పదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినా.. సంగారెడ్డి నుంచి బరిలోకి దిగిన జగ్గారెడ్డి మాత్రం ఓడిపోయారు. ఒకవేళ పార్టీతో పాటు జగ్గారెడ్డి కూడా గెలిచి ఉంటే… రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఓ మంత్రిగా ఆయన అవకాశం దక్కించుకుని ఉండేవారన్న వాదనలు వినిపించాయి.

అయితే మంత్రి పదవి లేకపోయినా… తనకు దక్కిన గుర్తింపును కొనసాగిస్తూ వస్తున్న జగ్గారెడ్డి పార్టీ పదవులపై ఆసక్తి పెంచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ పదవికి సరిగ్గా సరిపోతారని, వచ్చే ఎన్నికల్లో రేవంత్, జగ్గారెడ్డిల కాంబినేషన్ మరో విజయానికి శ్రీకారం చుడుతుందని వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. అదేదో నిజం అవుతున్నట్టు…మానవ అక్రమ రవాణా కేసు కూడా వీగిపోవడవం జగ్గారెడ్డికి కలిసి వచ్చే అంశమేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

Related Post

ఎంపికల్లో ఈ జాగ్రత్త ఉండాలి జగన్ఎంపికల్లో ఈ జాగ్రత్త ఉండాలి జగన్

నియోజ‌క‌వ‌ర్గాల‌కు నాయ‌కుల‌ను ఎంపిక చేస్తున్న జ‌గ‌న్‌పై అదే నాయ‌కుల నుంచి అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తమ ఒత్తిడితోనే జ‌గ‌న్ ఈ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా ?  లేక‌.. పార్టీ కోణంలో తీసుకుంటున్నారో అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం కొంద‌రు నాయ‌కుల‌ను నియోజ‌క‌వ‌ర్గాల‌కు

Aaya Sher from The Paradise: Nani, Anirudh & Srikanth Odela hit it out of the parkAaya Sher from The Paradise: Nani, Anirudh & Srikanth Odela hit it out of the park

Natural Star Nani will next be seen in the much-anticipated action drama The Paradise. The film, directed by Srikanth Odela, is scheduled for a grand release on August 21. Yesterday,