hyderabadupdates.com movies జడల్ నుంచి బ్లడీ రోమియో… నానికి మెంటల్ సవాల్

జడల్ నుంచి బ్లడీ రోమియో… నానికి మెంటల్ సవాల్

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం కెరీర్ లోనే అత్యంత ఇంటెన్స్ ఫేజ్ లో ఉన్నాడు. ఒకవైపు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ‘ద ప్యారడైజ్’, మరోవైపు సుజిత్ తో చేయబోతున్న ‘బ్లడీ రోమియో’.. ఈ రెండు ప్రాజెక్టులు నానిలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించేవే. అయితే ప్రస్తుతం నాని పూర్తి ఫోకస్ ‘ద ప్యారడైజ్’ మీదే ఉంది. ఆగస్టు 21న విడుదల కానున్న ఈ సినిమా కోసం నాని తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో ‘జడల్’ అనే క్యారెక్టర్ కోసం నాని పడుతున్న శ్రమ చూస్తుంటే అది కేవలం ఫిజికల్ మేకోవర్ మాత్రమే కాదు, మెంటల్ గా కూడా చాలా స్ట్రెస్ తో కూడుకున్నదని అర్థమవుతోంది.

నిజానికి సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ‘బ్లడీ రోమియో’ షూటింగ్ ఈపాటికే షురూ కావాల్సింది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా నాని వర్క్ షాప్స్ లో పాల్గొనాలని సుజిత్ ప్లాన్ చేశారు. కానీ ‘ద ప్యారడైజ్’ షూటింగ్ చివర్లో ఉండటం, ఆ క్యారెక్టర్ తాలూకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉండటంతో నాని ప్రస్తుతం ఆ ప్రపంచం నుంచి బయటకు రాలేకపోతున్నాడట. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను ఒక రకమైన మ్యాడ్ మ్యాక్స్ స్టైల్ లో తెరకెక్కిస్తున్నాడని, ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ చూస్తే ఆ మాస్ ఫ్లేవర్ ఏ రేంజ్ లో ఉండబోతోందో క్లారిటీ వచ్చేసింది. 

ఈ స్థాయిలో హై వోల్టేజ్ ఉన్న క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మరో కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం నాని లాంటి డెడికేటెడ్ నటుడికి కూడా పెద్ద టాస్కే. సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, ప్రమోషన్స్ కోసం కూడా నాని చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఒక సినిమా తాలూకు మూడ్ లో ఉంటూనే మరో సినిమా షూటింగ్ చేయడం వల్ల క్యారెక్టర్ డెలివరీ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అందుకే నాని చాలా తెలివిగా ‘బ్లడీ రోమియో’ షూటింగ్‌ను జూన్ రెండో వారానికి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.

నాని ముందున్న ప్రధాన సవాల్ ఏంటంటే.. ‘జడల్’ ప్రపంచం నుంచి పూర్తిగా బయటకు వచ్చి ‘బ్లడీ రోమియో’ బాడీ లాంగ్వేజ్‌ను పట్టుకోవడం. సుజిత్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా స్టైలిష్ గా, ఇంటెన్స్ గా ఉంటుంది. ఆ పాత్ర కోసం ప్రత్యేకమైన వర్క్ షాప్స్ అవసరమని సుజిత్ భావిస్తున్నాడు. అందుకే ప్యారడైజ్ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే కొత్త సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టాలని నాని నిర్ణయించుకున్నాడు. ఇది నాని కెరీర్ లో ఒక రకమైన ‘మెంటల్ షిఫ్ట్’ అని చెప్పాలి. రెండు భారీ చిత్రాలను బ్యాలెన్స్ చేయడం అంటే కత్తి మీద సామే.

ప్రస్తుతానికి నాని ప్లాన్ ప్రకారం జూన్ నుంచి సుజిత్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ గ్యాప్ లో ప్యారడైజ్ పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు బ్లడీ రోమియోకి సంబంధించిన బేసిక్ ప్రిపరేషన్ పూర్తి చేయనున్నాడు. శ్రీకాంత్ ఓదెల సినిమాలో ఉండే ఆ రగ్గడ్ లుక్ నుంచి సుజిత్ మార్క్ అల్ట్రా మోడరన్ లుక్ కి మారడం కూడా నాని ఫ్యాన్స్ కు ఒక విజువల్ ట్రీట్ లా ఉండబోతోంది. నాని తన సినిమాల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్లారిటీతో ముందుకు వెళ్తున్నాడు. ‘ద ప్యారడైజ్’ సృష్టించే ఇంపాక్ట్ తర్వాత సుజిత్ ‘బ్లడీ రోమియో’ తో నాని తన సక్సెస్ గ్రాఫ్ ను ఏ స్థాయికి తీసుకెళ్తాడో చూడాలి.

Related Post

AI Video Case: Kakinada Police Arrest Man Over Fake Content on Akira NandanAI Video Case: Kakinada Police Arrest Man Over Fake Content on Akira Nandan

Kakinada district police have arrested a man for creating and circulating an AI-generated fake video involving Akira Nandan, son of actor and politician Pawan Kalyan. The arrest was made by