hyderabadupdates.com movies జ‌న‌సేన వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌.. కాపు ఓట్ల‌పైనే గురి ..!

జ‌న‌సేన వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌.. కాపు ఓట్ల‌పైనే గురి ..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కీలకమైన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల నాటికి సంబంధించి రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేయడంతో పాటు ఆ ఓటు బ్యాంకును వైసీపీ వైపు మళ్లకుండా చూసుకునే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే సొంత ఇంటిని నిర్మించుకున్నారు.

తరచుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. పిఠాపురంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు రహదారుల నిర్మాణం వేగవంతంగా జరుగుతోంది అయితే ఇది ఒక్కటే కాకుండా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న అన్ని నియోజకవర్గాల పైన దృష్టి పెట్టాలని జనసేన భావిస్తోందిజ‌ దీనిలో భాగంగా పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కాపు సామాజిక వర్గం ప్రభలంగా ఉన్న మండలాలు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన. విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు ఇతర అవసరాలను తీర్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది.

దీంతో కాపు సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి పడకుండా చూడాల‌న్న‌దే కీల‌క నిర్ణ‌యం. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా చూసిన‌ట్టుగా.. వ‌చ్చే ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు ఆపార్టీకి ద‌క్కకుండా చూడాల‌ని నిర్ణ‌యించింది. అయితే టిడిపి, లేకపోతే జనసేనకు పడేలాగా వ్యవహరిస్తున్నారు, రాజకీయాల్లో ఇటువంటి వ్యూహాలు సర్వసాధారణం, ఏ పార్టీ అయినా పైకి ఏం చెప్పినా సామాజిక వర్గాల పరంగా ఎన్నికల సమయానికి అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది, కాబట్టి ఈ దశలో కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న కాపులను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన ప్రయత్నించటం విశేషం.

ఇప్పటికే మెజారిటీ ఓటు బ్యాంకు జనసేనకు లభించింది. ఇది మరింతగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇతర సామాజిక వర్గాల కంటే కూడా కాపులు జనసేన వైపు మళ్లేందుకు మెజారిటీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొలుత ఈ దిశగా అడుగులు వేయాలని పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే కాపు సామాజిక వర్గం ప్రభలంగా ఉన్న అన్ని నియోజకవర్గాల పైన దృష్టి పెట్టి కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ ఉండడం గమనార్హం.

Related Post

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు. అయితే, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాత్రం ఇందుకు తాను భిన్నం అంటున్నారు. అంతేకాదు, తప్పు చేస్తే కొట్టండి

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభంచేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచకలేకపోవడంతో రేసులో వెనుకబడిన వైనం తెలిసిందే. ప్రభాస్ ఇమేజ్ రక్షణ కవచంలా ఉండటంతో రెండు వందల కోట్ల మార్కు

‘మ్యాజిక్’ చుట్టూ చిక్కులు సమస్యలు‘మ్యాజిక్’ చుట్టూ చిక్కులు సమస్యలు

విజయ్ దేవరకొండ కింగ్డమ్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఇవాళ మరో సినిమా హాట్ టాపిక్ అయ్యేది. అదే మ్యాజిక్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్సే నిర్మించిన ఈ చిన్న మూవీ సంవత్సరం పైనే గడుస్తున్నా ఊసులో లేకుండా