hyderabadupdates.com movies జన నాయకుడు రాకపోడమే మంచిదయ్యింది

జన నాయకుడు రాకపోడమే మంచిదయ్యింది

జరిగేదంతా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. ఇది ఎంత నిజమో ప్రాక్టికల్ గా కొన్ని ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. జన నాయకుడు వాయిదా పడి కోర్టుల చుట్టూ తిరగడం తెలిసిన సంగతే. ఒకవేళ ఎలాంటి అడ్డంకులు లేకుండా జనవరి 9 తమిళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా రిలీజయ్యుంటే ఖచ్చితంగా రాద్ధాంతం జరిగేది.

ఎలా అనేది అర్థం కావాలంటే కొంచెం డీటెయిల్డ్ గా వెళ్ళాలి. పోస్ట్ పోన్ కన్నా ముందు జన నాయకుడుకి ఏపీ తెలంగాణలో స్క్రీన్ అలాట్మెంట్ జరిగిపోయింది. పివిఆర్ ఐనాక్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడంతో అధిక శాతం దాని మల్టీప్లెక్సుల్లోనే షోలు పడేలా ప్లాన్ చేసుకున్నారు.

భగవంత్ కేసరి పాక్షిక రీమేక్ అని తెలిసినా సరే ఇక్కడ విడుదలకు ఏర్పాట్లు చేసుకున్నారు. సరే మిస్ అవ్వడం ఎంత మంచిది అయ్యిందో చూద్దాం. ఉదాహరణకు హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ సప్తగిరి 70 ఎంఎం థియేటర్ ని తొలుత జన నాయకుడికి ఇచ్చారు. ఇప్పుడు దాని స్థానంలో నారి నారి నడుమ మురారి హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది.

ఒకవేళ డబ్బింగ్ మూవీ చెప్పిన డేట్ కి వచ్చి ఉంటే మన శర్వానంద్ కు ఒక పెద్ద స్క్రీన్ తగ్గేది. ఇక పివిఆర్ చైన్ లో ఎన్నో స్క్రీన్లు, కేవలం విజయ్ రాకపోవడం వల్ల మిగిలిన వాటికి ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకున్నాయి. ఇక్కడ ఇంకో కోణం చూడాలి.

మన శంకరవరప్రసాద్ గారు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కొన్ని ఏరియాల్లో సరిపడా థియేటర్లు ఇవ్వడం లేదని మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో అనగనగా ఒక రాజుతో సమానంగా పంపకాలు చేయడం లాంటివి వాళ్లకు నచ్చలేదు.

ఎవరి బిజినెస్ వారిదే కాబట్టి ఇక్కడ ఎవరిని తప్పుబట్టడానికి లేదు కానీ, తెలుగు స్ట్రెయిట్ సినిమాలు వాటిలో అవి ఎంతైనా కొట్టుకున్నా పర్వాలేదు కానీ మధ్యలో డబ్బింగులు కూడా దూరితే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇక జన నాయకుడు ఎప్పుడు ఏ డేట్ కు వచ్చినా ఇబ్బంది లేదు. అప్పటికంతా సంక్రాంతి సినిమాల ఫైనల్ రన్ దగ్గరలో ఉంటుంది.

Related Post

వైభవ్ సూర్యవంశీ… ఎందుకంత తొందర?వైభవ్ సూర్యవంశీ… ఎందుకంత తొందర?

​రాజస్థాన్ రాయల్స్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియా ఎంట్రీపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది వైభవ్ సృష్టించిన విధ్వంసం చూసి,

కల్ట్ ‘శివ’కు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారుకల్ట్ ‘శివ’కు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు

నవంబర్ 14 విడుదల కాబోతున్న శివ రీ రిలీజ్ కోసం అక్కినేని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ముప్పై నలభై ఏళ్ళ క్రితం వచ్చిన పాత సినిమాల రీ మాస్టరింగ్ ప్రింట్లు ఈ మధ్య కాలంలో మూవీ లవర్స్ ని నిరాశ