hyderabadupdates.com Gallery జ‌న నాయ‌గ‌న్ కు అడుగ‌డుగునా అడ్డుంకులు

జ‌న నాయ‌గ‌న్ కు అడుగ‌డుగునా అడ్డుంకులు

జ‌న నాయ‌గ‌న్ కు అడుగ‌డుగునా అడ్డుంకులు post thumbnail image

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడు త‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను న‌టించిన తాజా చిత్రం జ‌న నాయ‌గ‌న్. జ‌న‌వ‌రి 9వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు అడ్డుపుల్ల వేసింది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే భారీ బ‌డ్జెట్ తో తీసిన ఈ మూవీకి అడుగడుగునా అడ్డుంకులు ఏర్ప‌డ‌డంతో నిర్మాత‌లు భారీ న‌ష్టం వ‌స్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఈమేర‌కు జ‌న నాయ‌గ‌న్ రిలీజ్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని, మ‌ద్రాస్ హైకోర్టును ఆదేశించాల‌ని కోరుతూ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు దాఖ‌లైన పిల్ పై విచార‌ణ చేప‌ట్టేందుకు నిరాక‌రించింది ధ‌ర్మాస‌నం. ఇదే స‌మ‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ ప‌రిధిలో లేదంటూ పేర్కొంది.
అయితే జ‌న నాయ‌గ‌న్ మూవీ విడుద‌ల‌పై ఏదో ఒక నిర్ణ‌యం ఈనెల 20వ తేదీ లోపు తీసుకోవాల‌ని ఆదేశించింది మ‌ద్రాస్ హైకోర్టును. దీంతో ఆరోజు వ‌ర‌కు విజ‌య్ వేచి చూడాల్సిందే. మ‌రో వైపు జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న కూడా చేశారు మూవీ మేక‌ర్స్. సింగ‌పూర్ లో అట్ట‌హాసంగా ఆడియో లాంచ్ కూడా చేశారు. ఇప్ప‌టికే జ‌న నాయ‌గ‌న్ ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. కోట్లాది మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్నారు విజ‌య్. ఇదే క్ర‌మంలో త‌న‌ను రాజ‌కీయంగా ఎద‌గ‌కుండా చేసేందుకు కొన్ని శ‌క్తులు కావాల‌ని త‌న‌ను ఇబ్బంది పెట్టాల‌ని చూస్తున్నాయంటూ ఫ్యాన్స్ మండి ప‌డుతున్నారు. త‌ను టీవీకే పార్టీని ఏర్పాటు చేశాడు.
The post జ‌న నాయ‌గ‌న్ కు అడుగ‌డుగునా అడ్డుంకులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్రేమ‌కు, త్యాగానికి ప్ర‌తిరూపం మ‌హిళ‌లు : సీఎంప్రేమ‌కు, త్యాగానికి ప్ర‌తిరూపం మ‌హిళ‌లు : సీఎం

అమ‌రావ‌తి : సృష్టికి మూలం మహిళలేన‌ని, కష్టానికి, ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం మహిళలు అని కొనియాడారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆదివారం అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో జ‌రిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ఇక్క‌డికి వ‌చ్చిన‌ మహిళలను

రెవిన్యూ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డిరెవిన్యూ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డి

నంద్యాల జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం కొత్త బురుజులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్

తిరుమల : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తుల బృందంతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.