hyderabadupdates.com Gallery జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ

జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ

జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ post thumbnail image

న్యూఢిల్లీ : స‌న్స్ మైక్రోసాఫ్ట్ అధినేత వినోద్ ఖోస్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ ప్ర‌భావం అన్ని రంగాల‌లో ఉంటుంద‌ని, ముందు జాగ్ర‌త్త‌గా ప్ర‌త్యామ్నాయ మార్గాలు అన్వేషించ‌డం మంచిద‌ని సూచించారు. దేశ రాజ‌ధాని వేధిక‌గా జ‌రిగిన ఏఐ వ‌ర‌ల్డ్ స‌మ్మిట్ లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా అంత‌ర్జాతీయ మీడియాతో మాట్లాడారు. ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. ఎక్కువ‌గా ఐటీ, బిజినెస్ ప్రాసెస్ అసోసియేట్ (బీపీఓ) రంగాల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని అన్నారు. తాజాగా వినోద్ ఖోస్లా చేసిన కామెంట్స్ ఐటీ రంగంలో క‌ల‌క‌లం రేపాయి. రాబోయే రోజుల‌లో ఇండియాలోని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ఆలోచించ‌క పోవ‌డం మంచిద‌ని సూచించారు.
ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం, ఉద్యోగం కోసం చదవడం అనేవి సరైన ఆలోచన కాకపోవచ్చంటూ బాంబు పేల్చారు వినోద్ ఖోస్లా. వీటి స్థానంలో రోబోలు చేరుకుంటాయ‌ని, వేలాది మంది చేసే ప‌నుల‌ను కొన్ని రోబోలు భ‌ర్తీ చేస్తాయ‌న్నారు. రాబోయే రోజుల‌లో ఏఐలో నైపుణ్యం క‌లిగిన వారికే అత్య‌ధిక ప్రాధాన్య‌త ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఆరోగ్య సంక్ష‌ర‌ణ‌, విద్యా రంగానికి కొంత మేలు చేకూరుతుంద‌ని అన్నారు. స‌న్ మైక్రోసిస్ట‌మ్స్ ను స్థాపించ‌డం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు తెలిపారు. ప్ర‌పంచంలో అమెరికాకు ఎందుకంత క్రేజ్ ఉంద‌నే దానిపై కూడా క్లారిటీ ఇచ్చే ప్ర‌యత్నం చేశారు వినోద్ ఖోస్లా. మ‌నం కోరుకున్న‌ది జ‌రుగుతుంద‌ని అనుకోవ‌డానికి వీలు లేదు. కానీ వెన‌క్కి త‌గ్గ‌డం అంటూ జ‌ర‌గ‌ద‌న్నారు.
The post జాబ్స్ భ‌ర్తీపై ప్ర‌భుత్వాలు ఆలోచించ‌డం దండ‌గ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nainar Nagendran: తొక్కిసలాట ఘటనకు డీఎంకే నేత కారణం – నైనార్ నాగేంద్రన్Nainar Nagendran: తొక్కిసలాట ఘటనకు డీఎంకే నేత కారణం – నైనార్ నాగేంద్రన్

    టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ (Vijay) ర్యాలీలో తొక్కిసలాట ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి డీఎంకే పార్టీ మాజీ నేత సెంథిల్‌ బాలాజీనే కారణమని ఆరోపించారు. పథకం ప్రకారం

అత్యాధునిక సౌక‌ర్యాల‌తో జుడీషియ‌ల్ అకాడ‌మీఅత్యాధునిక సౌక‌ర్యాల‌తో జుడీషియ‌ల్ అకాడ‌మీ

అమరావతి : అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య‌‌‌ కాంత్ శంఖుస్థాపన చేశారు. ఈ జుడీషీయల్ అకాడమీని 165 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తుండగా దీనిలో బ్లాక్ బిలో జి

MLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావుMLA Harishrao: జోర్డాన్‌లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో మాట్లాడిన హరీశ్‌రావు

  ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికుల తో ఫోన్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మాట్లాడారు. ఆందోళన పడకండి… బీఆర్ఎస్ అండగా ఉంటుందని కార్మికులకు ఆయన ధైర్యం చెప్పారు. జోర్డాన్‌లో