hyderabadupdates.com Gallery జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం

జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం

జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం post thumbnail image

విశాఖ‌పట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ కొణిద‌ల గురువారం విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. త‌న తల్లి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించ‌చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు వెల్ల‌డించారు. జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ను ప్రారంభించారు.
జూపార్క్ లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎంక్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలు జూ క్యూరేటర్ ని అడిగి తెలుసుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు. జంతు శాలల్లో ఆహారం అందించేందుకు వెళ్లే సమయాల్లో జూ నిబంధనలు పాటించారు. కంబాలకొండ ఎకో పార్క్ లో నగర వనాన్నికూడా ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఎకో పార్క్ లోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గం మధ్యలో మొక్కల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జంతువుల సంర‌క్ష‌ణ అనేది ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త కావాల‌ని పిలుపునిచ్చారు. ఆయా సంస్థ‌లు సామాజిక బాధ్య‌త‌గా భావించాల‌ని సూచించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల.
The post జిరాఫీల‌ను దత్త‌త తీసుకున్న డిప్యూటీ సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

    గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Kerala: 136 మంది గాయకులతో రికార్డు సృష్టించిన ‘గాతా రహే మేరా దిల్‌’Kerala: 136 మంది గాయకులతో రికార్డు సృష్టించిన ‘గాతా రహే మేరా దిల్‌’

      దాదాపు 136 మంది గాయకులు ఏకధాటిగా 40 గంటలపాటు ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ కిశోర్‌ కుమార్‌కు చెందిన 460 పాటలను ఆలపించి రికార్డు సృష్టించారు. షోడశీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘గాతా రహే మేరా దిల్‌’ పేరిట కేరళలోని

మ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లుమ‌చిలీప‌ట్నం పోర్టు రోడ్డు కోసం రూ. 570 కోట్లు

అమ‌రావ‌తి : కేంద్రం తీపి క‌బురు చెప్పింది. ఏపీలోని మ‌చిలీప‌ట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు కేంద్ర ఉపరిత‌ల, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. ఈ