hyderabadupdates.com Gallery జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు

జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు

జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు post thumbnail image

తిరుమల : శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ తీపి కబురు చెప్పింది. 2026 జూలై నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. ల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వ‌యో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరింది టీటీడీ.
The post జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !

    బిహార్‌ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్‌

అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలిఅమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజధాని నిర్మాణ పనులపై క్యాంప్ కార్యాలయంలో శ‌నివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ‌హించారు. సమీక్షకు హాజర‌య్యారు మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణ పనులు

రేప్ కేసులో కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ అరెస్ట్రేప్ కేసులో కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ అరెస్ట్

కేర‌ళ : కేర‌ళ ఎమ్మెల్యే రాహుల్ మ‌మ్కూట‌తిల్ కు బిగ్ షాక్ త‌గిలింది. రేప్ చేసిన కేసులో త‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలుకు త‌ర‌లించారు. గ‌త‌ డిసెంబర్ 2024లో పాలక్కాడ్ ఉప ఎన్నికలో రాహుల్ సాధించిన అద్భుత విజయం తర్వాత