hyderabadupdates.com movies జోగి బ్రదర్స్ కు బెయిల్ వచ్చింది కానీ…

జోగి బ్రదర్స్ కు బెయిల్ వచ్చింది కానీ…

నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాముకు ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో ఇద్దరూ గత 79 రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. అయితే మరో కేసు పెండింగ్‌లో ఉండటంతో, బెయిల్ వచ్చినప్పటికీ జైలు నుంచి వెంటనే విడుదలయ్యే పరిస్థితి లేదు.

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నమోదైన మరో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఇంకా నిందితుడిగా ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 3న ఎక్సైజ్ అధికారులు అక్కడ దాదాపు రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం, 40 స్పిరిట్ క్యాన్లు, 17,224 మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు, మూతలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కూడా బెయిల్ లభించినప్పుడే జోగి రమేష్ జైలు నుంచి విడుదల అవుతారని అధికారులు స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంలో ఏ1 నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు, జోగి రమేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం దందా ప్రారంభించినట్లు విచారణలో వెల్లడించినట్టు సిట్ పేర్కొంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడం, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కుట్ర జరిగిందని ఆరోపించింది.

ఈ ఆరోపణల నేపథ్యంలో 2025 నవంబర్ 2న జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రామును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

Related Post

`ల‌డ్డూ నివేదిక`: వైసీపీ ఎందుకు తొక్కిపెట్టింది?`ల‌డ్డూ నివేదిక`: వైసీపీ ఎందుకు తొక్కిపెట్టింది?

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న అత్యంత కీల‌క‌మైన చ‌ర్చ శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ కావ‌డ‌మే!. ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ముఖ్యంగా వైసీపీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైవీ సుబ్బారెడ్డి క‌ల్తీ

అఖండ-2లో శివుడు ఎవరు?అఖండ-2లో శివుడు ఎవరు?

‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు ఓపెనింగ్స్‌పై ఆ ప్రభావం ఏమీ కనిపించలేదు. మేకర్స్ ప్రకటించిన ప్రకారం తొలి రోజు ఈ చిత్రం రూ.60 కోట్ల దాకా