hyderabadupdates.com Gallery జోరుగా పోలింగ్..ఓటు వేసిన టీవీకే విజ‌య్

జోరుగా పోలింగ్..ఓటు వేసిన టీవీకే విజ‌య్

జోరుగా పోలింగ్..ఓటు వేసిన టీవీకే విజ‌య్ post thumbnail image

త‌మిళ‌నాడు : దేశంలోని త‌మిళ‌నాడుతో పాటు ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ప్ర‌ధాన పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డ్డారు. త‌మిళ‌నాడులో ఒకే రోజు 234 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ కొన‌సాగుతోంది. కానీ ప‌శ్చిమ బెంగాల్ లో రెండు విడతులుగా పోలింగ్ ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టింది ఈసీ. అత్యంత‌ కట్టుదిట్టమైన భద్రత నడుమ 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సామాన్య పౌరులు లాగానే త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ప్ర‌ముఖ న‌టుడు , ఇల‌య నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ త‌న కూతురు, న‌టి శృతి హాస‌న్ తో క‌లిసి ఓటు వినియోగించుకున్నారు. త‌లైవా ర‌జ‌నీకాంత్, ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం, న‌టి సుహాసిని, ఖుష్బు, సుంద‌ర్ , ఇలా చాలా మంది ఓటు వేశారు.
ఇక ఈసారి ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన కొత్త పార్టీ పెట్టిన ప్ర‌ముఖ న‌టుడు టీవీకే విజ‌య్ స్వ‌యంగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయ‌న రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోటీ చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సున్నితమైన, కీలకమైన పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు భారీ భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMలు), ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (VVPAT) వ్యవస్థలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో ధృవీకరించు కోవడానికి, తెల్లవారు జామున మాక్ పోలింగ్ నిర్వహించారు. కరూర్‌లోని బూత్ నంబర్ 135 వద్ద, అసలు ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్ చేప‌ట్టారు.
తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలకమైన ఎన్నికల్లో మొత్తం 5.73 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులు. వివిధ రాజకీయ పార్టీలు, కట్టుదిట్టమైన పర్యవేక్షణలో రోజంతా పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. మార్గదర్శకాలను పాటిస్తూ, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎన్నికల క‌మిష‌న్ కోరింది.
The post జోరుగా పోలింగ్..ఓటు వేసిన టీవీకే విజ‌య్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రేపే ఒంటిమిట్ట‌లో కోదండ రాముడికి ప‌ట్టు వ‌స్త్రాలురేపే ఒంటిమిట్ట‌లో కోదండ రాముడికి ప‌ట్టు వ‌స్త్రాలు

అమరావతి : నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు. మొదట నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలుకొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు

అమ‌రావ‌తి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. పంచాయతీల పునర్విభజన పైనా న్యాయపరమైన అడ్డంకులు

ఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీఏపీ బ‌డ్జెట్ లో బీసీల అభ్యున్న‌తికి ప్ర‌యారిటీ

అమరావతి : బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని కేటాయింపులు చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్