hyderabadupdates.com movies టాలీవుడ్ ఫిబ్రవరి – సరిపోలేదు ఊపిరి

టాలీవుడ్ ఫిబ్రవరి – సరిపోలేదు ఊపిరి

కొత్త ఏడాది జనవరి నెల ఘనంగా ప్రారంభమయ్యింది. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ చేస్తే సంక్రాంతి పండక్కు థియేటర్లు పండగ చేసుకున్నాయి. విపరీతమైన నష్టాలు తెచ్చింది ఏదీ లేకపోవడం పెద్ద ఊరట కలిగించింది.

ఇదే ఊపు కాకపోయినా అందులో సగమైనా ఫిబ్రవరిలో ఉంటుందని బయ్యర్లు ఆశించారు కానీ ఈ నెల మాత్రం పెద్దగా పనవ్వలేదు. చాలా చోట్ల సింగల్ స్క్రీన్లు మెయింటెనెన్స్ ఖర్చులు భరించలేక బోలెడు షోలు క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ మంత్ ఇచ్చిన ఆనందాన్ని సెకండ్ మంత్ పూర్తి స్థాయిలో నిలబెట్టలేకపోయింది.

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన గుణశేఖర్ కంబ్యాక్ మూవీగా ‘యుఫోరియా’ మీద ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు కానీ అవి ఒక్క శాతం కూడా నెరవేరలేదు. నవీన్ చంద్రతో కరుణ కుమార్ చేసిన హారర్ ప్రయోగం ‘హానీ’ కనీసం ఊసులో లేనంతగా ఫ్లాప్ అయ్యింది. డీసెంట్ టాక్ వచ్చినా ‘శ్రీ చిదంబరంగారు’కి ఆదరణ కరువయ్యింది.

తెగ హడావుడి చేసిన ‘ఫంకీ’ సితార బ్యానర్ ఖాతాలో మరో డిజాస్టర్ వేసింది. అర్జున్ స్వయంగా పబ్లిసిటీ చేసుకున్న ‘సీత పయనం’ ఎలాంటి ప్రయాణం లేకుండానే ఆగిపోయింది. సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఒక్కటే చెప్పుకోదగ్గ టాక్ తో ఏ సెంటర్లలో నెంబర్లు రాబట్టి సేఫ్ గేమ్ ఆడింది.

టైటిల్ మార్పు దగ్గరి నుంచే హైప్ తెచ్చుకున్న ‘హే బలవంత్’ నిర్మాతలు ఆశించినంత మేజిక్ చేయలేదు. రెండు మూడు రోజులు కాసిన్ని నెంబర్లు కనిపించాయి కానీ వీక్ డేస్ లోనే ఫైనల్ రన్ కు వచ్చేసింది. ప్రొడ్యూసర్లు మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యిందని థియేటర్, ఓటిటి, శాటిలైట్ కలిపి చెప్పేస్తున్నారు.

శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ మీద మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. సన్నాఫ్, నిలవే, నవాబ్ కేఫ్ లాంటి వాటిని జనం కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏతావాతా చెప్పేదేమంటే ఫిబ్రవరిలో యునానిమస్ గా అన్ని వర్గాలతో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా లేకపోవడం లోటే. మార్చిలో మృత్యుంజయ్ తో మంచి బోణీ జరుగుతుందేమో చూడాలి.

Related Post

Dhandoraa – A Fair Attempt That Finds Its Strength in the FinaleDhandoraa – A Fair Attempt That Finds Its Strength in the Finale

Dhandoraa is a 2025 Telugu-language social drama written and directed by Murali Kanth Devasoth. The film has Shivaji, Navdeep, Nandu, Ravi Krishna, Manika, Bindu Madhavi, Raadhya & Mounika Reddy playing