hyderabadupdates.com Gallery టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో విశేష ఉత్స‌వాలు

టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో విశేష ఉత్స‌వాలు

టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో విశేష ఉత్స‌వాలు post thumbnail image

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏప్రిల్ నెల‌కు సంబంధించి తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈనెల 10, 17, 24 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చి ఉత్సవం శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో కొన‌సాగుతుంద‌ని తెలిపింది. 11న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గం.లకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఏప్రిల్ 30 నుండి మే 02వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు, వసంతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 29న అంకురార్పణ జ‌ర‌గనుంది. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో 16న ఉత్తరాభద్ర నక్షత్రం సందర్భంగా తిరుచ్చిపై సాయంత్రం 7 గం.లకు స్వామి వారు విహరిస్తారు.శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయంలో 21న రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 7 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుందని టీటీడీ పేర్కొంది. శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో. 29 తేదీన హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో 04, 11, 18, 25 తేదీలలో శనివారం ఉదయం 8 గం.లకు స్వామివారికి అభిషేకం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది టీటీడీ. ఇక అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో 07న మంగళ వారం ఉదయం 8 గం.లకు అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వ‌హించ‌నున్నారు. 10, 17, 24 వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం జ‌ర‌గ‌నుంది. 08న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం. 12న ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం జ‌ర‌గ‌నుంది. 05, 12, 19, 26 తేదీలలో శ్రీ ఆంజనేయ స్వామి మూలవర్లకు అభిషేకం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది టీటీడీ.
The post టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో విశేష ఉత్స‌వాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Maganti Gopinath: మాగంటి గోపీనాథ్‌ వారసత్వంపై ముదిరిన వివాదంMaganti Gopinath: మాగంటి గోపీనాథ్‌ వారసత్వంపై ముదిరిన వివాదం

    ఇటీవల కన్నుమూసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వారసత్వానికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు అసలైన వారసులం తామేనని… గోపీనాథ్‌ మొదటి భార్య మాలినిదేవి, కుమారుడు తారక్‌ ప్రద్యుమ్న తెలిపారు. గతంలోనే దీనిపై రంగారెడ్డి కలెక్టర్‌కు గోపీనాథ్‌

మెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలిమెరుగైన ఫ‌లితాలపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి

తిరుప‌తి : టీటీడీ జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని అధ్యాపకులకు సూచించారు. గురువారం ఆయన ఆక‌స్మికంగా

Kerala: 136 మంది గాయకులతో రికార్డు సృష్టించిన ‘గాతా రహే మేరా దిల్‌’Kerala: 136 మంది గాయకులతో రికార్డు సృష్టించిన ‘గాతా రహే మేరా దిల్‌’

      దాదాపు 136 మంది గాయకులు ఏకధాటిగా 40 గంటలపాటు ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ కిశోర్‌ కుమార్‌కు చెందిన 460 పాటలను ఆలపించి రికార్డు సృష్టించారు. షోడశీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘గాతా రహే మేరా దిల్‌’ పేరిట కేరళలోని