hyderabadupdates.com Gallery టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో

టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో

టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో post thumbnail image

తిరుమల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవోను, చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇటీవ‌లే ల‌డ్డూ క‌ల్లీ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. మ‌రో వైపు కల్తీ చోటు చేసుకుందంటూ సాక్షాత్తు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సైతం బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. ఆపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు ను ఏర్పాటు చేశారు. ఈ మేర‌కు రంగంలోకి దిగిన సిట్ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది.
ఈ మేర‌కు త‌న‌కు అందిన నివేదిక‌ను తీసుకున్న వెంట‌నే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టీటీడీ చ‌రిత్ర‌లోనే రెండు సార్లు ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి (ఈవో)గా నియ‌మించ బ‌డ్డారు సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్. ఆయ‌న వ‌చ్చీ రావ‌డంతోనే టీటీడీ ఆధ్వ‌ర్యంలో వైకుంఠ ఏకాద‌శి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆ వెంట‌నే నివేదిక ఆధారంగా వెంట‌నే ఆనాటి అకౌంట్స్ ఆఫీస‌ర్ బాలీజీని , ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ పై బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న స్థానంలో ముద్దాడ ర‌విచంద్ర‌ను ఈవోగా నియ‌మించారు సీఎం. ఇవాళ ర‌విచంద్ర టీటీడీ చైర్మ‌న్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.
The post టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మ‌హేష్ బాబు ‘వార‌ణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్మ‌హేష్ బాబు ‘వార‌ణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

హైద‌రాబాద్ : ప్రిన్స్ మ‌హేష్ బాబు, అందాల తార ప్రియాంక చోప్రా కీ రోల్స్ పోషించిన చిత్రం వార‌ణాసి. దీనికి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో దీనిని తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే వార‌ణాసి

Azam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలుAzam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలు

    డబుల్‌ పాన్‌ కార్డు కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్‌ నేత ఆజంఖాన్‌, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది. అబ్దుల్లా ఆజం అసలు పుట్టిన తేదీ 1993 జనవరి 1వ

Karur Stampede: సీబీఐ చేతికి కరూర్‌ తొక్కిసలాట కేసుKarur Stampede: సీబీఐ చేతికి కరూర్‌ తొక్కిసలాట కేసు

Karur Stampede : కరూర్‌ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు(CBI) అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు నిరాకరించడంతో పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు.