hyderabadupdates.com Gallery టీటీడీ చైర్మ‌న్ ను వెన‌కేసుకు వ‌స్తున్న చంద్ర‌బాబు

టీటీడీ చైర్మ‌న్ ను వెన‌కేసుకు వ‌స్తున్న చంద్ర‌బాబు

టీటీడీ చైర్మ‌న్ ను వెన‌కేసుకు వ‌స్తున్న చంద్ర‌బాబు post thumbnail image

అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత అని పేర్కొన్నారు. అత్యంత నిష్ఠతో చేయాల్సి ఉండ‌గా అలాంటి టీటీడీ ఛైర్మన్‌ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలని అన్నారు. కానీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని ఆరోపించారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు జ‌గ‌న్ రెడ్డి. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుకు లేఖ రాశారు.
ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించు కోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్నిరకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ ఛైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారని మండిప‌డ్డారు జ‌గ‌న్ రెడ్డి. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుకి భక్తీ లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంద‌ని అన్నారు.
The post టీటీడీ చైర్మ‌న్ ను వెన‌కేసుకు వ‌స్తున్న చంద్ర‌బాబు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటుప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటు

అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతం నీరుకొండలో బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రజల‌ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనత‌, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. అన్న ఎన్టీఆర్

CM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబుCM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబు

  విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ దేశంలో గతంలో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం… ఇప్పుడు యూఏఈకి వెళ్లనుంది. నవంబరు 14,

Chinna Srisailam Yadav: కుమారుడి గెలుపుపై చిన్న శ్రీశైలం యాదవ్‌ సంచలన కామెంట్స్Chinna Srisailam Yadav: కుమారుడి గెలుపుపై చిన్న శ్రీశైలం యాదవ్‌ సంచలన కామెంట్స్

  అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చినోనికి హైదరాబాద్‌ లో రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదని నవీన్‌యాదవ్‌ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ విమర్శించారు. కుమారుడి గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రచారం సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నవీన్‌ యాదవ్‌పైనా,