hyderabadupdates.com movies టీడీపీ ఎమ్మెల్యేపై రోజా బాడీ షేమింగ్ కామెంట్స్

టీడీపీ ఎమ్మెల్యేపై రోజా బాడీ షేమింగ్ కామెంట్స్

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అంబటి ఇంటిపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త దాడి చేయించారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఆ క్రమంలోనే మాధవిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత రోజా విమర్శలు గుప్పించారు. అయితే, ఆ నేపథ్యంలో రోజా తనను బాడీ షేమింగ్ చేశారని గళ్లా మాధవి ఆరోపిస్తున్నారు. అయితే, రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేయబోనని ఆమె చెప్పారు.

వైసీపీ నేతలకు ఇలా బాడీ షేమింగ్ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం కొత్త కాదని మాధవి అన్నారు. వాళ్లు బేసిగ్గా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలంటే వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు. సబ్జెక్ట్ కు వారు పరిమితం కారని, అసలు విషయంపై ఏమీ మాట్లాడరని విమర్శించారు.

ప్రత్యర్థి పార్టీల నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే వైసీపీ నాయకుల లక్షణమని అన్నారు. అలా చేయడం వల్ల ఎదుటివారు సబ్జెక్ట్ గురించి సమాధానం చెప్పలేరని వారు భావిస్తుంటారని అన్నారు.

అప్పుడు తమ వాదన కరెక్ట్ అని ప్రజలు భావిస్తారన్నది వైసీపీ నేతల భావన అని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్…ఇలా అందరు నాయకులను రోజా ముందుగా బాడీ షేమింగ్ చేస్తారని అన్నారు. అదే మాదిరిగా తనపై కూడా రోజా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారని, కానీ, ఆ వ్యాఖ్యలపై స్పందించి తన స్థాయిని తాను తగ్గించకోబోనని మాధవి చెప్పారు.

వాళ్లకు వచ్చిన పదజాలాన్ని, భాషను వాడతారని, అంతకుమించి వారికి ఏమీ తెలీదని, వారిని ఇప్పుడు సంస్కరించలేమని చురకలంటించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కుల రాజకీయాలను తెరపైకి తెచ్చారని, లడ్డూ ఫ్లెక్సీలపై వివాదం రేపారని అన్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి..ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తాము ముందుకు పోతున్నామని, ఇటువంటి వ్యాఖ్యలపై, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ఎజెండాలపై స్పందించి సమయం వృథా చేయబోమని మాధవి మరోసారి స్పష్టం చేశారు.

Related Post

The Girlfriend – An Impactful & Thought-Provoking Relationship DramaThe Girlfriend – An Impactful & Thought-Provoking Relationship Drama

The Girlfriend is a 2025 Telugu-language Romantic film written and directed by Rahul Ravindran. The film has Rashmika Mandanna & Dheekshith Shetty playing the lead roles while Anu Emmanuel, Rao

‘ఏపీలో కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు’…అసలేంటిది?‘ఏపీలో కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు’…అసలేంటిది?

‘ఏపీలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లాగా జగన్ “కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు” అనే వ్యవస్థను స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరించారని’ అంటూ ప్రస్తుత హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఇంతకీ ఆమె చెప్పిన అధ్యక్షుడు ఎవరో

లోక కళ్యాణానికి ‘అఖండ’ తాండవంలోక కళ్యాణానికి ‘అఖండ’ తాండవం

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరున్న బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ తాండవం 2 డిసెంబర్ అయిదు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ శివరాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా ట్రైలర్ లాంచ్