hyderabadupdates.com movies టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ సంచలనం ఆయుష్ బదోనీని బీసీసీఐ ఎంపిక చేసింది. 2026 సంవత్సరంలో భారత జాతీయ జట్టుకు ఎంపికైన తొలి కొత్త ఆటగాడిగా బదోనీ అరుదైన గుర్తింపు పొందాడు.

వడోదరలో జరిగిన మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో సుందర్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఐదు ఓవర్ల తర్వాత మైదానాన్ని వీడిన అతను, బ్యాటింగ్ చేసినా క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. దీంతో మెడికల్ టీమ్ సూచన మేరకు అతడు మిగిలిన సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మెరుపులు మెరిపించిన బదోనీకి సెలెక్టర్లు పిలుపునిచ్చారు. ఆయుష్ బదోనీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 46 ఇన్నింగ్స్ ఆడి 963 పరుగులు చేశాడు, అందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడే ఈ యంగ్ ఆల్ రౌండర్ రాక జట్టుకు అదనపు బలం కానుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ యువ ఆటగాడిని అదృష్టం వరించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడి రిషభ్ పంత్ సిరీస్ నుంచి తప్పుకోగా, ధ్రువ్ జురెల్‌ను అతని స్థానంలో తీసుకున్నారు.

మరోవైపు టీ20 సిరీస్‌కు కూడా యువ ఆటగాడు తిలక్ వర్మ గాయంతో దూరమవ్వడం జట్టుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మొదటి వన్డేలో కోహ్లీ (94), గిల్ (56) అద్భుత ప్రదర్శనతో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ నిర్ణయాత్మక రెండో వన్డే జనవరి 14న రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో బదోనీ తుది జట్టులో చోటు సంపాదించి అరంగేట్రం చేస్తాడో లేదో చూడాలి.

Related Post

నెట్ ఫ్లిక్స్ ఇడ్లీలు భలే తింటున్నారునెట్ ఫ్లిక్స్ ఇడ్లీలు భలే తింటున్నారు

ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఇడ్లి కడై తమిళంలో ఓ మోస్తరుగా ఆడింది కానీ తెలుగులో డిజాస్టర్ మూటగట్టుకుంది. ఎమోషనల్ మూవీ కాబట్టి మన ప్రేక్షకులు ఆదరిస్తారనే అంచనా పూర్తిగా తప్పింది. ఒరిజినల్ వెర్షన్ కు డ్యూడ్ తో పోటీ

`నో కింగ్స్‌`: క‌దం తొక్కిన అమెరికా.. ట్రంప్‌కు సెగ‌!`నో కింగ్స్‌`: క‌దం తొక్కిన అమెరికా.. ట్రంప్‌కు సెగ‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల‌ను.. ఆయ‌న వ్య‌వ‌హార శైలిని తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌డుతు అమెరిక‌న్లు రోడ్డెక్కారు. నిజానికి ట్రంప్ అధ్య‌క్ష‌పీఠం ఈ రోజు(అక్టోబ‌రు 20) ఎక్కి కేవ‌లం 10 మాసాలే అయింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 20న ఆయ‌న అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడిగా