hyderabadupdates.com Gallery ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్

‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్

‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్ post thumbnail image

హైద‌రాబాద్ : తెలుగు తెరపై స‌రికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఎమోషనల్ రివెంజ్ డ్రామా ‘డైమండ్ డెకాయిట్’. పార్ధ గోపాల్ నిర్మాణంలో, దర్శకుడు సూర్య జి యాదవ్ ద‌ర్శ‌క‌త్వంలో పార్ధ గోపాల్ , మేఘ‌న జంట‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ పాటలను ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య పాల్గొని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “సినిమా పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. పెద్దపల్లి రోహిత్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. పాట‌లు, ట్రైల‌ర్ చూసి ఆ రిచ్ నెస్‌కు ప‌డిపోయాను. ద‌ర్శ‌కుడు కొత్త అయిన‌ప్ప‌టికీ బాగా చేశాడు. పార్ధ గోపాల్ త‌న‌పై తాను బ‌డ్జెట్ పెట్టుకునే స్థితి నుంచి త‌న‌పై పెద్ద ప్రొడ్యూస‌ర్లు పెట్టుబ‌డి పెట్టేంత స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉంది. చిత్ర యూనిట్‌ మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.
చిత్ర నిర్మాత, హీరో పార్ధ గోపాల్ మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. మా సినిమా ఆడియోను వి.ఎన్. ఆదిత్య చేతుల మీదుగా విడుదల చేయించడం ఎంతో ఆనందంగా ఉంది. మా సినిమాకు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అయిన‌ ద‌ర్శ‌కుడికి కృత‌జ్ఞ‌త‌లు. దర్శకుడు సూర్య జి. యాదవ్ గత మూడున్నరేళ్లుగా ఎన్నో కష్టాలు, ఎత్తుపల్లాలు ఎదుర్కొంటూ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన పాటలకు కూడా ప్రశంసలు వస్తున్నాయి.
The post ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేతLocal Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేత

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు (High Court) తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది.

TG Local Bodies Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం !TG Local Bodies Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం !

    స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతోంది. నవంబర్ 26 లేదా 27వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగనుందని తెలుస్తోంది. మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు

President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ముప్పుPresident Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ముప్పు

President Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం ముర్ము (President Droupadi Murmu) తిరువనంతపురం చేరుకున్నారు. బుధవారం ఉదయం ఆమె శబరిమల బయల్దేరారు. ప్రమదంలోని రాజీవ్‌ గాంధీ