hyderabadupdates.com movies డైరెక్టర్‌కు ఇల్లు కొనిస్తానన్న నిర్మాత

డైరెక్టర్‌కు ఇల్లు కొనిస్తానన్న నిర్మాత

‘చి ల సౌ’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రాహుల్ రవీంద్రన్. ముందు నటుడిగా పరిచయం అయిన అతడిలో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆ చిత్రానికి జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు రాహుల్. రెండో చిత్రం ‘మన్మథుడు-2’ మిస్ ఫైర్ అయినప్పటికీ.. తన కొత్త సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ధీరజ్ మొగిలినేని ఫలితం మీద చాలా నమ్మకంతో ఉన్నాడు.‘ది గర్ల్ ఫ్రెండ్ పెద్ద విజయం సాధిస్తుందని.. తర్వాత తాను దర్శకుడు రాహుల్‌కు ఇల్లు కూడా కొనిస్తానని ధీరజ్ ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో చెప్పడం విశేషం.

ఇప్పటి వరకు రాహుల్‌కు ఎక్కడా సొంతిల్లు లేదని.. ఈ సినిమా హిట్టయితే.. తర్వాతి సినిమాకు మంచి రెమ్యూనరేషన్ తీసుకుని ఒక ఇల్లు కొనుక్కోవాలని తనతో అన్నారని ధీరజ్ తెలిపాడు. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారని.. వాళ్లను చూసినపుడల్లా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనిపిస్తుందని రాహుల్ చెప్పినట్లు ధీరజ్ వెల్లడించాడు. తర్వాత రాహుల్‌ను ఉద్దేశించి.. ‘‘బ్రో ఈ సినిమా హిట్టయ్యాక మీ సొంతింటి కల నేను నెరవేరుస్తాను. మీరు నాకు తర్వాత ఎప్పుడైనా సినిమా చేయండి. కానీ ముందు నేను మీ సొంతింటి కలను నెరవేరుస్తాను. ఇది మీ ఒక్కరి కోసం కాదు. మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం’’ అని ధీరజ్ అన్నాడు.

ఇక రాహుల్ కమిట్మెంట్ ఎలాంటిదో ధీరజ్ చెబుతూ.. ‘‘ఈ కథ గురించి ఒక హీరోకు నరేషన్ ఇవ్వాల్సి ఉన్నపుడు రాహుల్ నాకు కాల్ చేశాడు. తన ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటారా అని అడిగాడు. నేను వెళ్తే వాళ్ల అపార్ట్‌మెంట్ కింద చిన్మయి గారు పురిటి నొప్పులతో కారు ఎక్కుతున్నారు. తన కారు చిన్మయికి ఇచ్చి పంపిస్తుండడంతో తనను పిక్ చేసుకోవడానికే రాహుల్ నన్ను పిలిచాడని అర్థమైంది. చిన్మయిగారు ఇద్దరు బిడ్డల్ని క్యారీ చేస్తూ కూడా నా దగ్గరికి వచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో నరేషన్ ఏంటి అంటే.. తర్వాత వెళ్దాం అన్నా రాహుల్ ఒప్పుకోలేదు. చిన్మయి గారు కూడా నరేషన్ ఇచ్చాకే తన దగ్గరికి రమ్మన్నారట. వాళ్లకు సినిమా ఎంత ముఖ్యమో, దాని పట్ల ఎంత కమిట్మెంటో చెప్పడానికి ఇది ఉదాహరణ’’ అని ధీరజ్ తెలిపాడు.

Related Post

దుమారం రేపిన కామెంట్లపై బండ్ల వివరణదుమారం రేపిన కామెంట్లపై బండ్ల వివరణ

బండ్ల గణేష్.. గత కొన్ని వారాల్లో టాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశం అయిన పేరు ఇదే. ముందుగా లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో హీరో మౌళిని కొనియాడుతూ ఇండస్ట్రీలో మాఫియా ఉందంటూ కామెంట్ చేశాడు. అంతే కాక అల్లు అరవింద్ మీద